Lagacharla: లగచర్లలో భూసేకరణ నిలిపివేత.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! లగచర్ల భూసేకరణపై రేవంత్ సర్కార్ వెనక్కు తగ్గింది. భూసేకరణ నిలిపివస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ పై దాడి .. అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By Nikhil 29 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల భూసేకరణ ప్రజాభిప్రాయ మీటింగ్ కు వెళ్లిన కలెక్టర్ పై దాడి.. అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లోని దూద్యాల మండలంలో ఫార్మసిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇక్కడ ఫార్మాసిటీ వద్దని ప్రజలు ఆందోళన చేపట్టారు. అయితే.. ఈ నెల 11న ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడి జరగడం సంచలనంగా మారింది. దీంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. Also Read : Nellore: భయపడొద్దు పులి పారిపోయింది.. చిరుత సంచారంపై అటవిశాఖ క్లారిటీ! Land Acquisition లగచర్లలో భూసేకరణ నిలిపివేత.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల భూసేకరణ ప్రజాభిప్రాయ మీటింగ్ కు వెళ్లిన కలెక్టర్ పై దాడి.. అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.@revanth_anumula @KTRBRS#Telangana… pic.twitter.com/Dlossg71yf — RTV (@RTVnewsnetwork) November 29, 2024 Also Read : ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా వెళ్తే నష్టపరిహారం పొందొచ్చు.. ఎలాగంటే? ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ సైతం రైతులకు మద్దతుగా ఆందోళనలు స్టార్ట్ చేసింది. జాతీయ మానవహక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు సైతం ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ లగచర్లలో భూసేకరణపై వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే.. ఫార్మాసిటీ కాదని ఇటీవల రేవంత్ రెడ్డి సైతం ప్రకటించారు. దీంతో ఈ రద్దు తాత్కాలికమా? ఇతర పరిశ్రమలను ఏమైనా ఏర్పాటు చేస్తారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. Also Read : మల్లారెడ్డి కాలేజీలో 'పుష్ప2' ఫ్రీ రిలీజ్ ఈవెంట్! Also Read : పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. ఎమ్మెల్యేపై సీరియస్ #telangana-government #revanth-reddy #lagacharla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి