FLASH: పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. ఎమ్మెల్యేపై సీరియస్

కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా? అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు.

New Update
Pawan Kalyan,

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా తరలి పోతుందంటూ అప్పటి ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యం కారణంగానే రేషన్ బియ్యం అక్రమంగా తరలి వెళ్లిపోతుందంటూ అప్పట్లో రచ్చ రచ్చ చేశారు. 

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం!

అయితే ఇప్పుడు కూటమి నేతలకు వారి సొంత ప్రభుత్వంలోనూ అదే సమస్య తలెత్తింది. కాకినాడ పోర్టు నుంచి టన్నుల కొద్ది రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుంది. దీంతో ఏపీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వరుస తనిఖీలు చేపట్టారు. కానీ ఏమాత్రం మార్పు రావడం లేదు. 

ఇది కూడా చదవండి: ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్!

ఇక ఇటీవలే కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ సౌతాఫ్రికా షిప్ ను కలెక్టర్, ఎస్పీ పట్టుకున్నారు. దాదాపు 640 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. 

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ అరెస్ట్!

ఇందులో భాగంగానే ఇవాళ ఆ షిప్ ను పరిశీలించేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లారు. అక్కడ సౌతాఫ్రికా షిప్ తో సహా బార్జీలలో ఎగుమతికి సిద్దంగా ఉన్న మరో షిప్ ను పవన్, మనోహర్ కలిసి పరిశీలించారు. 

అదే సమయంలో పోర్ట్ అధికారులను పవన్ ప్రశ్నించారు. బియ్యం రవాణాపై ఎటువంటి నిబంధనలు ఉంటాయని అడిగి తెలుసుకున్నారు.  ఇందులో భాగంగానే సిటీ ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం ఎగుమతుల్లో మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ ప్రశ్నించారు. మనం పోరాటం చేసింది దీని కోసమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!

అదే సమయంలో ఎమ్మెల్యే కొండబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ పవన్ వినిపించుకోలేదు. మీరు సరిగా ఉంటే పోర్ట్ లోకి పిడిఎస్ రైస్ ఎలా వస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక పవన్ ప్రశ్నలతో ఎమ్మెల్యే కొండబాబు ఉక్కిరిబిక్కిరయ్యారు. అదే సమయంలో పవన్ పోలిసులపై కూడా సిరియస్ అయ్యారు. ఈ మేరకు కాకినాడ డిఎస్పీ పై మండిపడ్డారు. ఇక్కడ ఇంత స్మగ్లింగ్ చేస్తూంటే మీరు ఏమి చేస్తూన్నారంటూ సిరియస్ అయ్యారు. అనంతరం పోర్ట్ తనిఖీ విభాగం నుంచి షిప్ పై సముద్రంలోకి వేళ్లారు.

news being updating...

Advertisment
Advertisment
తాజా కథనాలు