/rtv/media/media_files/2025/05/05/4c0vNHFmJzaN6UKAiooX.jpg)
Telangana Police CM Revanth Reddy
తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీగా పోలీస్ అధికారుల బదిలీలు చేపట్టింది. రెండు రోజుల క్రితం 77 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 30 మంది ఏఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా ఉన్న జీ నరేందర్ ను భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ ఎస్పీగా నియమించింది. ఖమ్మం అడిషనల్ డీసీపీగా ఉన్న నరేష్ కుమార్ ను జయశంకర్ భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా నియమించింది. భూపలపల్లి అడిషనల్ ఎస్పీగా ఉన్న కిషన్ ను వరంగల్ అడిషనల్ ఎస్పీగా నియమించింది. త్వరలో మరిన్ని బదిలీలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పనితీరు సమర్థత ఆధారంగానే అధికారులకు పోస్టింగ్ లు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
(telangana-police | latest-news | telugu-news | telugu breaking news)