ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సంపన్నులు, రిటైర్డ్ ఉద్యోగులు, సినీ సెలబ్రిటీలు, వృద్ధులే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు పెట్టుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం.. వాట్సాప్ నెంబర్‌కు వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరిస్తున్నారు. బాధితుల పేరు మీద మనీలాండరింగ్ జరిగిందని బెదిరిస్తున్నారు. ఇది రహస్య ఇన్విస్టిగేషన్ అంటూ నమ్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుటుంబాన్నంతటినీ అరెస్ట్ చేస్తామంటూ చెమటలు పట్టిస్తున్నారు.
Also Read: 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!
ఇలా చెప్పి వారి నుంచి కోట్లలో డబ్బులు గుంజేస్తున్నారు. ఈ మోసాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా చైతన్యం రావడం లేదు. తరచూ ఏదో ఒక ప్రాంతంలో సైబర్ మోసం జరుగుతూనే ఉంది. అలాంటిదే ఇటీవల మరొకటి జరగగా.. దానికి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు.
Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్
ఇద్దరు నిందితులు అరెస్ట్
షేర్ ట్రేడింగ్‌లో మెలకువలను నేర్పిస్తామంటూ ఇటీవల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి దాదాపు రూ.8.14 కోట్లు కొట్టేశారు సైబర్ నేరస్థులు. ఈ కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ రాజస్థాన్ ఉదయ్‌పుర్ జిల్లా మంగ్రికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Also Read: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా
అందులో 21 ఏళ్ల రాహుల్ దంగి, 25 ఏళ్ల ఆజాద్‌నగర్‌కు చెందిన రాహుల్ భోయ్‌ను ఉదయ్‌పుర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు ఆదివారం టీజీసీఎస్‌బీ తెలిపింది. వీరిద్దరిని విచారించగా.. సంచలన విషయాలు బయటకొచ్చాయి. రాహుల్ దంగి, రాహుల్ భోయ్‌లు తమ పేర్లతో బ్యాంక్ కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేసి వాటిని సైబర్ కేటుగాళ్లకు అప్పగించినట్లు విచారణలో తేలింది.
అందులో రాహుల్ దంగి ఖాతాలోకి బాధితుడికి చెందిన దాదాపు 75 లక్షలు ట్రాన్సఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఒక్క ట్రాన్సఫర్ మాత్రమే కాకుండా దేశ వ్యప్తంగా దాదాపు 32 సైబర్ నేరాలకు చెందిన రూ.3.7 కోట్ల డబ్బు ఈ ఖాతాలోకి బదిలీ అయినట్లు తెలిపారు. అలాగే రాహుల్ భోయ్ పని కరెంట్ ఖాతాలను సైబర్ నేరస్థులకు చేరవేయడం. వారి దగ్గర రాహుల్ భోయ్ ఒక ఏజెంటుగా పనిచేస్తున్నాడు.
Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం
అలా అతడు దాదాపు 5 కరెంట్ ఖాతాలను సైబర్ కేటుగాళ్లకు అందించగా.. వారు ఇప్పటికి రెండు అకౌంట్లను మాత్రమే వినియోగించినట్లు తెలిసింది. అందులో దాదాపు 20 సైబర్ స్కామ్‌లకు చెందిన డబ్బు బదిలీ అయినట్లు తెలిపారు. ఇక రూ.8.14 కోట్ల మోసానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే రాజస్థాన్‌లోని చిత్తౌడ్‌గఢ్‌కు చెందిన శ్రవణ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.