మందుబాబుల్లో తెలంగాణ టాప్.. ఒక్కో వ్యక్తి ఎంత ఖర్చు చేస్తున్నారంటే? దేశ వ్యాప్తంగా అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో ఉంది. సగటున ఒక్కో వ్యక్తి మద్యంపై రూ.1623 ఖర్చు చేస్తున్నట్లు ఎన్‌ఐపీఎఫ్‌పీ తెలిపింది. ఆ తర్వాత రూ.1306తో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, రూ.1245తో పంజాబ్ మూడో స్థానంలో ఉన్నాయి. By Kusuma 31 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణలో ఏ పండుగ వచ్చినా, ఫంక్షన్ వచ్చినా మందు పార్టీ ఉండాల్సిందే. పార్టీ అంటే ముక్కతో పాటు చుక్క ఉండాలి. అయితే దేశవ్యాప్తంగా అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. మద్యం వల్ల ప్రభుత్వానికి కూడా ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇది కూడా చూడండి: ఉదయం పూట తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే! తెలంగాణ మొదటి స్థానంలో.. దేశవ్యాప్తంగా ఏఏ రాష్ట్రాల్లో మందు బాబులు సగటున ఏడాదికి మద్యంపై ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయంపై ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఒక జాబితా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మద్యం కోసం సగటున ఓ వ్యక్తి చేసిన ఖర్చులో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవగా.. ఏపీ రెండో స్థానంలో నిలిచింది. అత్యంత తక్కువ ఖర్చు చేసిన రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. ఇది కూడా చూడండి: గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే? 2022-23 లెక్కల ప్రకారం తెలంగాణలో సగటున ఒక వ్యక్తి మద్యంపై రూ.1623గా ఖర్చు చేస్తున్నట్లు ఎన్‌ఐపీఎఫ్‌పీ తెలిపింది. దేశవ్యాప్తంగా మద్యం తాగుతున్న వారిలో ఇదే అత్యధికం. ఆంధ్రప్రదేశ్ రూ.1306 ఖర్చుతో రెండో స్థానంలో నిలవగా, పంజాబ్ రూ.1245తో మూడోస్థానంలో, ఛత్తీస్‌గడ్ రూ.1227తో నాలుగోస్థానంలో, ఒడిశా రూ.1156తో ఐదో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఏ పండుగ వచ్చినా, పార్టీ వచ్చినా మద్యం తీసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. దీంతో మద్యంపై ఎక్కువ ఖర్చుచేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. ఇది కూడా చూడండి: బాణసంచా తయారీపై పిడుగు.. ఇద్దరు మృతి మద్యంపై అతి తక్కువ ఖర్చు చేస్తున్న వ్యక్తి రాష్ట్రాల జాబితాలో వెస్ట్ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. 2022-23లో పశ్చిమబెంగాల్‌లో సగటున ఓ వ్యక్తి మద్యంపై కేవలం రూ.4 మాత్రమే ఖర్చు చేసినట్లు నివేదిక తెలిపింది. దేశంలో జనాభా ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ ఒక్కో వ్యక్తి సగటున మద్యంపై ఏడాదికి రూ.49 మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఇది కూడా చూడండి: దీపావళి జరుపుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే! #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి