ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు.. ఆ నిబంధన ఎత్తివేయనున్న ప్రభుత్వం!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రేవంత్ సర్కార్ ప్లాన్ రెడీ చేసింది. వచ్చే ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

New Update
ELACTIONS

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రేవంత్ సర్కార్ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది అంటే 2025 జనవరిలో సంక్రాంతికి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలోగా కులగణన సర్వే పూర్తి చేసి సంక్రాతి తర్వాత ఎలక్షన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వచ్చె నెలలో హియరింగ్​ ఉంది. దీంతో డిసెంబర్​ రెండో వారం కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది.​

Also Read: అఖిల్‌ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!

కులగణన సర్వే వివరాలు రాగానే వాటిని డెడికేటెడ్ కమిషన్ కు అందించనుంది. అందులోని వివరాలు, కమిషన్​ చేసిన అధ్యయన నివేదిక రెండింటి ఆధారంగా రిజర్వేషన్లను ఎంతమేరకు పెంచాలనే దానిపై ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఇందులో భాగంగానే రిజర్వేషన్లను ఖరారు చేసి.. ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ అంతా డిసెంబర్​ చివరిలోగా పూర్తి కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Also Read:ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ!

ఇక గత జనవరి 31తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలనలో గ్రామపంచాయతీలు నడుస్తున్నాయి. ఈ మేరకు జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మూడు దశలలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 4 నుంచి 5 వేల గ్రామాలకు ఒక విడత చొప్పున 3 విడతల్లో ఎన్నికలు పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తెప్పించుకుని, గ్రామాలు, వార్డుల వారీగా పబ్లిష్​ చేసింది. షెడ్యూల్​ రిలీజ్​ కంటే ముందు మరోసారి సప్లిమెంటరీ ఓటర్ల జాబితాను తీసుకోనుంది.

Also Read: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్‌

మరో విశేషం ఏంటంటే.. పంచాయితీ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధన పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ప్రభుత్వం బిల్లు పెట్టనున్నట్లు సమాచారం. 

ఎంపీటీసీ ఎన్నికలకు కసరత్తు: 

ఇక సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కొన్ని మండలాలకు ముగ్గురు ఎంపీటీసీలతోనే ఎంపీపీలు ఉండనున్నట్లు సమాచారం. అలాగే కనీసం ఐదుగురు ఎంపీటీసీలతో ఎంపీపీలు ఉండేలా ఆయా మండలాల్లో సంఖ్య పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీల సంఖ్య సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎంపీటీసీల పదవీ కాలం గత జులై రెండుతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక సర్పంచ్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు, 538 జడ్పిటిసిలు, 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు