బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రోజు రోజుకూ ముదురుతోంది. తండ్రితో తాడో పేడో తేల్చుకోవడానికి కవిత రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా తాను రాసిన లేఖ లీక్ కావడంపై ఆమె సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. లీకువీరులు, పార్టీలోని దెయ్యాలను తేల్చాలని ఆమె డిమాండ్ చేస్తోంది. తండ్రి కేసీఆర్ నుంచి పిలుపు కోసం ప్రస్తుతం కవిత ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యమిస్తే ఒకే అని.. లేకపోతే కఠిన నిర్ణయం తప్పదని కవిత సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ కాదంటే ప్లాన్-B రెడీ అంటోంది కవిత వర్గం. ఈ మేరకు కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరుపై సన్నిహితులతో కవిత మంతనాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
(brs-mlc-kalvakuntla-kavitha | kcr | Ktr | telugu-news | telugu breaking news)