Ponnam Prabhakar: బీసీ రిజర్వేషన్లు పెంచి తీరుతాం.. మా నెక్ట్స్ స్టెప్ ఇదే.. మంత్రి పొన్నం సంచలన ప్రకటన!

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించామన్నారు.

New Update
ponnam

Ponnam Prabhakar Key Announcement Over BC Reservations

హైకోర్టు(High Court) మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించామన్నారు. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్, సబ్ కమిటీ వేసిందన్నారు. కేబినెట్ ఆమోదంతో శాసన సభలో చట్టం చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపు గవర్నర్ కు పంపించినట్లు చెప్పారు. 2018 పంచాయతీ రాజ్ చట్టానికి కూడా సవరణ చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదన్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఈ రోజు హైకోర్టు విచారణ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామన్నారు. 

Also Read :  బీజేపీ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్?

Also Read :  బీసీ రిజర్వేషన్లు పెంచి తీరుతాం.. మా నెక్ట్స్ స్టెప్ ఇదే.. మంత్రి పొన్నం సంచలన ప్రకటన!

Advertisment
తాజా కథనాలు