డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. జనవరిలో గ్రామాలకు కొత్త సర్పంచ్ లు వస్తారన్నారు. ఈ రోజు నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరితో సర్పంచ్ ల పదవీ కాలం ముగిసింది. దీంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫర్లను నియమించింది. దీంతో వారి ఆధ్వర్యంలోనే పల్లెల పాలన కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: కేటీఆర్ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు
అయితే.. సర్పంచ్ ల పదవీకాలం ముగిసిన కొన్ని రోజులకే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.గత రిజర్వేషన్లనే కొనసాగించాలని నిర్ణయించింది. ఎన్నికలు ఆలస్యం అయి స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోతే.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు ఆటంకం ఏర్పడుతుందని ప్రభుత్వం భావించింది. అయితే.. పాత రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు నష్టపోతారని ఆయా సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: PM Modi vs CM Revanth: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ మాస్ కౌంటర్!
6 నుంచే కుల గణన..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కులగణన నిర్వహించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. కులగణన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 6 నుంచి కులగణను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ కులగణన నవంబర్ 30తో ముగియనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించనుంది రేవంత్ రెడ్డి సర్కార్. కులగణను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రేవంత్ సర్కార్ ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇది కూడా చదవండి: MLA Gaddam Vinod: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక!
ఇది కూడా చదవండి: కేటీఆర్ పోయి అమెరికాలో బాత్రూంలు కడుక్కో.. రఘునందన్ సంచలన కామెంట్స్!