/rtv/media/media_files/2025/08/27/jaggareddy-helping-2025-08-27-09-26-58.jpg)
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్టైలే వేరు. ఆయన ఏం మాట్లాడినా.. ఏం చేసినా ప్రత్యేకమే. పాలిటిక్స్ పై మాత్రమే కాకుండా.. గత కొన్నేళ్లుగా ఆయన సేవా కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు లక్షల కొద్దీ సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో 9 ఏళ్ల నుంచి బాధ పడుతున్న ఓ బాలికకు ఆయన సహాయం చేశారు. 3 లక్షల రూపాయలు అందించారు. హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి:Ganesh Chaturthi 2025: కేవలం ఆ 4 గంటలు మాత్రమే సౌండ్ సిస్టమ్.. రోడ్డుకు అడ్డంగా ఉండొద్దు.. హైకోర్టు సంచలన ఆదేశాలు!
చీమల మందు కలిపిన చపాతీ తినడంతో..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సుష్మ 9 ఏళ్ల క్రితం దసరా పండుగకు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లింది. అయితే.. అక్కడ పొరపాటున చీమల మందు కలిపిన చపాతిని తిని అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి ఆమె కోలుకోలేదు. 9 ఏళ్లుగా మంచానికే పరిమితమైంది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో మంచి వైద్యం అందించలేకపోయామని తండ్రి చెవుగాని మహేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తమ ధీన స్థితిని వీరు గాంధీ భవన్ మీడియాకు చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు జగ్గారెడ్డికి విషయం చెప్పారు. వెంటనే జగ్గారెడ్డి ఆ యువతి తండ్రి మహేష్ ను పిలిపించి మాట్లాడారు. వైద్యులతో స్వయంగా మాట్లాడారు.
ఇది కూడా చదవండి:BIG BREAKING: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై సంచలన అప్‌డేట్.. నోటిఫికేషన్ విడుదల
9 ఏళ్ళు గా తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలికకు జగ్గారెడ్డి చేయూత..
— Turupu Jagga Reddy (@ImJaggaReddy) August 26, 2025
3 లక్షల ఆర్దిక సహాయం చేసిన జగ్గారెడ్డి..
హైదరాబాద్ లో కార్పోరేట్ ఆసుపత్రిలో బాలిక చికిత్స కు సహాయం చేస్తానని హామీ ఇచ్చిన జగ్గారెడ్డి..
తమ ధీన స్థితిని గాంధీ భవన్ మీడియా కు చెప్పడం తో విషయాన్ని జగ్గారెడ్డి కి… pic.twitter.com/SP9NtQEsjZ
అన్ని రకాల వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తే పాప మళ్లీ లేచి నడవగలదో చెప్పాలని కోరారు. సర్జరీ లాంటి చికిత్స అవసరం అయితే తాను మరికొంత ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డితో ప్రభుత్వం నుంచి పూర్తి వైద్య ఖర్చులు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇంకా దాతలు కూడా ముందుకు రావాలని కోరారు. ఆర్థిక సహాయం చేయాలనుకునే వారు తండ్రి మహేష్ నెంబర్ ను 9553461480 సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
నా నియోజకవర్గం లో క్యాన్సర్ తో బాధపడే నిరుపేదలకు ట్రీట్ మెంట్ కోసం ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నాను..
— Turupu Jagga Reddy (@ImJaggaReddy) June 9, 2025
క్యాన్సర్ ట్రీట్ మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నరు..
క్యాన్సర్ పేషంట్ ను పరామర్శించిన జగ్గారెడ్డి
క్యాన్సర్ పేషంట్… pic.twitter.com/j6Sli0AVNq