Ganesh Chaturthi 2025: కేవలం ఆ 4 గంటలు మాత్రమే సౌండ్ సిస్టమ్.. రోడ్డుకు అడ్డంగా ఉండొద్దు.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్‌ సిస్టమ్‌ను వాడాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సౌండ్ ను నిబంధనల ప్రకారం నిర్దేశించిన డెసిబెల్‌ స్థాయి దాటకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

New Update
Telangana High Court

నేడు దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం ఊరూవాడా ముస్తాబయ్యాయి. అయితే ఉత్సవాల  నిర్వహణపై తెలంగాణ హైకోర్టు నిబంధనలు విధించింది. సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీకి చెందిన ప్రభావతి అనే మహిళ తన ఇంటికి ఆనుకుని మండపాలు ఏర్పాటు చేశారంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఇంకా పలువురు సైతం గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో పిటిషన్లు వేశారు. పిటిషనర్ల అభ్యంతరాలను పరిష్కరించాలని హైకోర్టు అధికారులను గతంలో ఆదేశించింది. అయినా పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే సమయంలో ప్రజల నుంచి వచ్చే వినతులు, ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని పోలీసులను, అధికారులను ఆదేశించింది. 
ఇది కూడా చదవండి: Ganesh Chaturthi 2025: ప్రతిష్ట కాకముందే గణేశుడి నిమజ్జనం.. హైదరాబాద్‌లో అపశృతి.. అసలేమైందంటే?

హైకోర్టు నిబంధనలు:

  1. పొల్యూషన్ యాక్ట్ లోని నిబంధనల మేరకు సాయంత్రం 6 గంటలు- రాత్రి10 గంటల వరకు మాత్రమే సౌండ్‌ సిస్టమ్‌ను అనుమతించాలని స్పష్టం చేసింది. 
  2. సౌండ్ ను నిబంధనల ప్రకారం నిర్దేశించిన డెసిబెల్‌ స్థాయి దాటకుండా చర్యలు తీసుకోవాలి.
  3. స్కూల్స్, హాస్పటల్స్, వృద్ధాశ్రమాలు ఉండే వైపు లౌడ్‌ స్పీకర్లు పెట్టొద్దు.
  4. సౌండ్ ను డెసిబుల్‌ మీటర్లతో ఎప్పటికప్పుడు చెక్ చేయాలి.
  5. మండపాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆగిపోకుండా నిర్వాహకులు చూసుకోవాలి.
  6. నిమజ్జనాలు పూర్తయిన తర్వాత మండపాలు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని నిర్వాహకులు శుభ్రం చేయాలి.
  7. ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ లు వెళ్లేలా.. ట్రాఫిక్‌కు సమస్య లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలి.
  8. మండపానికి కరెంట్ కనెక్షన్‌ ఇవ్వడం కోసం తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి.
  9. ట్రాఫిక్‌ కు అడ్డు లేకుండా, ఇళ్లు, ఆస్పత్రులకు వెళ్లే మార్గాలకు ఆటంకం లేకుండా మండపాలు ఉండాలి.
  10. విగ్రహాలను సాధ్యమైనంత వరకు స్థానికంగా ఉన్న బహిరంగ ప్రదేశాలు, కమ్యూనిటీ మైదానాల్లో ప్రతిష్టించాలి.
  11. స్థానికుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు హెల్ప్‌ డెస్క్‌లు పోలీస్‌ స్టేషన్లలో ఏర్పాటు చేసుకోవాలి. 
  12. మండపాల దగ్గర నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి. ఏం జరిగినా వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి:Ganesh Fest: గణేశ్‌ మండపాన్ని పెడుతున్నారా ? ఈ రూల్స్‌ మీకు తెలుసా? తప్పకుండా పాటించాల్సిందే

Advertisment
తాజా కథనాలు