Lakshman: ఉపరాష్ట్రపతిగా తెలంగాణ నేత లక్ష్మణ్!

భారత ఉపరాష్ట్రపతిగా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ పేరు వినపడుతోంది. ఎన్‌డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి రేసులో డాక్టర్‌ లక్ష్మణ్‌ ముందున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు మెంబర్ గానూ కొనసాగుతున్నాడు.

New Update
Telangana leader Lakshman as Vice President!

Telangana leader Lakshman as Vice President!

భారత ఉపరాష్ట్రపతిగా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ లక్ష్మణ్‌(Lakshman) పేరు వినపడుతోంది. ఎన్‌డీఏ ఉప రాష్ర్టపతి అభ్యర్థి రేసులో డాక్టర్‌ లక్ష్మణ్‌ ముందున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నాడు. మోడీ, అమిత్ షా లకు చాలా  సన్నిహితుడిగా లక్ష్మణ్‌కు పేరుంది. ప్రస్తుతం పార్టీలో కీలకమైన పోస్ట్  పార్లమెంటరీ బోర్డు మెంబర్,   ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నారు. ఇప్పటివరకు పార్టీ ఇచ్చిన బాధ్యతలంటిలోనూ సమర్థవంతుడిగా, పార్టీకి లాయల్ గా ఉండటాన్ని గుర్తించిన పార్టీ అధిష్టానం ఆయనకు ఉప రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందన్న ప్రచారం సాగుతోంది.ఈసారి దక్షిణ భారతదేశాని కే ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం.

Also Read :  తల్లి ఎఫైర్.. తట్టుకోలేక కొడుకు సూ**సైడ్.. ఆ గ్రామంలో హైటెన్షన్!

Telangana Leader Lakshman As Vice President

కాగా వైస్ ప్రెసిడెంట్ ను సౌత్ ఇండియా నుంచి ఎంపిక చేస్తే, బీజేపీ(BJP) జాతీయ అధ్యక్ష పదవి నార్త్ కు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సౌత్ ఇండియాలో బలమైన నేతగా , హిందీ , ఇంగ్లీష్ పై మంచి పట్టున్న నాయకుడిగా లక్ష్మణ్ కు గుర్తింపు ఉంది.ఇదే విషయంపై ఇటీవల జరిగిన Nda పార్లమెంటరీ పార్టీ  సమావేశం లో చర్చకు  వచ్చినట్టు సమాచారం. Nda వర్గాల్లో డాక్టర్ లక్ష్మణ్ పేరు  మార్మోగుతుంది. వచ్చే నెల 9వ తేదీన పరాష్ట్రపతి ఎలక్షన్ జరగనుంది. దీంతో ఈ నెల 12న లక్ష్మణ్‌ పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ దన్ ఖర్ రాజీనామా చేశారు. జగదీప్ ధన్‌ఖర్ జులై 21న అనారోగ్య కారణాలతో ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. ఆయన పదవీకాలం వాస్తవానికి ఆగస్టు 2027 వరకు ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మధ్యంతర ఎన్నికల ద్వారా ఎన్నికైన వ్యక్తికి పూర్తి ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. సెప్టెంబర్ 9న ఎన్నికలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21న చివరి తేదీగా ప్రకటించింది. 22న నామినేషన్ల పరిశీలన, 25న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. సెప్టెంబర్ 9న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ పేర్కొంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం పార్లమెంటులోని ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో ఎంపీలందరూ (ఎన్నికైనవారు, నామినేటైనవారు) పాల్గొంటారు. సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటు పద్ధతి ద్వారా ఈ ఎన్నికలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి. కాగా ఈసారి దక్షిణాదికి ఉప రాష్ట్రపతి పదవి కేటాయిస్తే డా, లక్ష్మణ్‌కు అవకాశం దక్కనుందన్న ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చదవండి:సృష్టి ఫర్టిలిటీ స్కాంలో 80 మంది శిశువుల విక్రయం.. వెలుగులోకి నమ్రత బాగోతాలు

Advertisment
తాజా కథనాలు