లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో కేటీఆర్ అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నేడే కేటీఆర్‌ను అరెస్టు ఉండొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండడంతో బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుంటున్నారు. లగచర్ల కుట్రలో కేటీఆర్ పాత్ర ఉందంటూ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ పాత్రను అంగీకరించారని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: కలెక్టర్ వస్తే తరిమికొడదాం.. పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో విడుదల!
గవర్నర్ అనుమతి అవసరం లేకపోవడంతో..
ఫార్ములా-ఈ రేసులో అవకతవకల వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందన్న ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. అయితే కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ అంశంపై ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. దీంతో ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. అయితే.. లేఖ రాసి 15 రోజులైనా గవర్నర్ నుంచి ప్రభుత్వానికి అనుమతి రాలేదు.
ఇది కూడా చదవండి: TG:టీచర్ ఉద్యోగాల భర్తీలో గందరగోళం.. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్.. !
ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో సహా ముఖ్య నేతలు బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఆ రెండు పార్టీల కుమ్మక్కు కారణంగానే బీఆర్ఎస్, బీజేపీ పెద్దల ద్వారా గవర్నర్ పై ఒత్తిడి తెస్తోందంటూ ఆరోపిస్తున్నారు. అయితే.. కలెక్టర్ పై దాడి కేసులో అనుమతి అవసరం లేదు. కేవలం స్పీకర్ కు సమాచారం ఇస్తే సరిపోతుంది. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ
తన అరెస్ట్ వార్తలపై కేటీఆర్ ఈ రోజు ఉదయం X ద్వారా స్పందించారు. తనను ఏదో ఒక కేసులో రేవంత్ రెడ్డి ఇరికించి అరెస్ట్ చేస్తాడని ఎప్పుడో తెలుసన్నారు. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతానన్నారు. రేవంత్ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరన్నారు.
ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా!