TG News: మేఘాకు బిగ్ షాక్.. ఆ రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు!

మేఘాకు బిగ్ షాక్ తగిలింది. గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ కు తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

author-image
By srinivas
New Update
ede e

TG News:  తెలంగాణలో మేఘాకు బిగ్ షాక్ తగిలింది. గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్ కు.. అక్కడి నుంచి హైదరాబాద్ కు తాగునీటి అవసరాల పేరిట గత ప్రభుత్వం డిజైన్ చేసిన ఈ డొంక తిరుగుడు పనులను విరమించుకుంది. ఈ మేరకు మేఘా ఇంజనీరింగ్​ కంపెనీకి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్మెంట్ ఇంజనీరింగ్ విభాగం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేశవపురం రిజర్వాయర్, అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యే దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా కానుంది. అదే ఖర్చుతో.. గోదావరి ఫేజ్ 2 స్కీమ్ ను మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్ గ్రేటర్ సిటీ తాగునీటి అవసరాలకు తాగునీటిని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

Municipal Administration

ఇది కూడా చదవండి: Pawan Vs Stalin: పవన్ Vs స్టాలిన్.. దక్షిణాదిలో బీజేపీ బిగ్ స్కెచ్!

ఆరేండ్లయినా పెండింగ్ లోనే పనులు..

హైదరాబాద్ కు 10 టీఎంసీల తాగు నీటిని సరఫరా చేయటంతో పాటు జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని హైదరాబాద్ వాటర్ బోర్డ్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పాత టెండర్ల ప్రకారం ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కేశవపురం చెర్వు నింపుతారు. కేశవపురం చెర్వును 5 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ గా నిర్మిస్తారు. అక్కడి నుంచి ఘన్​పూర్​ మీదుగా హైదరాబాద్ కు 10 టీఎంసీల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఆరేండ్లయినా ఈ పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణ చిక్కులతో పాటు అనాలోచితమైన అలైన్మెంట్ కారణంగా పనులు ముందుకు సాగలేదు. గత ప్రభుత్వం అటవీ భూములు, రక్షణ శాఖ భూముల నుంచి ప్రాజెక్టును డిజైన్ చేయటం, ఎంచుకున్న పైపులైన్ రూట్ సరిగ్గా లేకపోవటంతో పనులు ముందుకు సాగకపోడందో పూర్తిగా ఆగిపోయాయి.
 

ఇది కూడా చదవండి: Trump-Modi: ఓ మై ఫ్రెండ్‌...అంటూ ట్రంప్‌ కి శుభాకాంక్షలు తెలిపిన మోదీ!

ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అంచనాల సవరణ..

ఇక గత ప్రభుత్వం హయంలో ఈ టెండర్లను దక్కించుకున్న మేఘా కంపెనీ ఈ పనులు చేపట్టకుండా వదిలేసింది. 2017 నాటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం పనులు చేపట్టలేమని, 2024 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అంచనాలను సవరించాలని మెఘా కంపెనీ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. రేట్ల పెంపును తిరస్కరించటంతో పాటు ఇప్పటివరకు పనులు చేపట్టని కారణంగా మెఘా కంపెనీకి కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతో గ్రేటర్ సిటీకి తాగునీటి సరఫరాతో పాటు ఉస్మాన్​ సాగర్​, హిమాయత్​ సాగర్​  నీటిని నింపేందుకు ఎక్కువ భాగం గ్రావిటీతో వచ్చేలా కొత్త అలైన్మెంట్ ప్రకారం పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి:  పవన్ Vs స్టాలిన్.. దక్షిణాదిలో బీజేపీ బిగ్ స్కెచ్!


Advertisment
Advertisment
తాజా కథనాలు