/rtv/media/media_files/2025/10/22/maganti-gopinath-wife-suneetha-2025-10-22-18-10-10.jpg)
Jubilee Hills By Election 2025: నామినేషన్ల పరిశీలన రోజున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత దివంగత ఎమ్మెల్యే గోపినాథ్ భార్యే కాదని తారక్ ప్రద్యుమ్న అనే వ్యక్తి రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. సునీత తన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని అతను పేర్కొన్నారు. గోపినాథ్‌కు చట్టబద్ధమైన ఏకైక కుమారుడిని తానేనన్నారు. 1998 ఏప్రిల్ 29న గోపీనాథ్ కోసరాజు మాలిని దేవిని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. వారికి తాను జన్మించానని వివరించారు. తన తల్లి మాలిని దేవితో విడాకులు తీసుకోకుండానే సునీతతో గోపినాథ్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తారక్ రిటర్నింగ్ ఆఫీసర్ కు తెలిపారు. సునీత ఈ విషయాన్ని దాచిపెట్టి తనను గోపినాథ్‌కు చట్టబద్ధమైన భార్యగా, తన పిల్లలను చట్టబద్ధమైన వారసులుగా తప్పుగా అఫిడవిట్లో చూపించారని ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే గోపినాథ్ మొదటి పెళ్లి విషయాలను దాచారని తారక్ ఆరోపించార. సునీత అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎన్నికలు ఎదుర్కోలేక చిల్లర రాజకీయం కాకపోతే ఇన్నిరోజులు లేనిది ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది
— AR (@AshokReddyNLG) October 22, 2025
మాగంటి గోపీనాథ్ గతంలో ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్ లోనే భార్య సునీత, పిల్లలుగా అక్షర, దిశిర, వాత్సల్యనాథ్ పేర్లు మెన్షన్ చేశారు
కొసరాజు ప్రద్యుమ్న కొడుకు అయితే గోపీనాథ్… pic.twitter.com/h48mPqKJuf
అయితే.. గోపినాథ్ 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లోనూ సునీతనే తన భార్యగా పేర్కొన్నారు. దీంతో అప్పుడు లేని వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చిందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది కాంగ్రెస్ నేతల కుట్ర అని ఆరోపిస్తున్నారు. గోపినాథ్ చనిపోయిన సమయంలో మొదటి భార్య, కొడుకు ఎందుకు రాలేదని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు పోస్టులు పెడుతున్నారు. మరో వైపు సునీత నామినేషన్ ఆమోదిస్తున్నట్లు ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. దీంతో ఈ ఫిర్యాదుపై ఈసీ ఎలా స్పందిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Follow Us