/rtv/media/media_files/2025/03/03/F0RsQ39P7V6YuXOPQS65.jpg)
telangana inter public exams starts from march 5
ఏపీలో ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైపోయాయి. మార్చి 1వ తేదీ నుంచి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా మొదలైయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 5వ తేదీ అంటే ఎల్లుండి నుంచే ఈ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక ప్రకటన రిలీజ్ చేసింది.
Also Read : టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
కొత్త రూల్స్
ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను రిలీజ్ చేసింది. అందులో పరీక్ష ప్రారంభం అయ్యే 15 నిమిషాల ముందుగానే గేట్లు మూసేస్తారని నిబంధన ఉంది. అయితే ఆ నిబంధనను కచ్చితంగా అమలు చేయడం లేదని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఇప్పటి వరకు పరీక్ష ప్రారంభమై ఒక్క నిమిషం అయినా స్టూడెంట్స్‌ను పరీక్షకు అనుమతించేవారు కాదు. కానీ ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ (5నిమిషాలు లేటు వచ్చినా పర్వాలేదు) ఇస్తున్నట్లు వెల్లడించారు.
Also read : SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
/rtv/media/media_files/2025/03/03/7pOWdAmafPYfeFQZD2tb.jpeg)
అలాగే పరీక్షా కేంద్రాల వద్ద BNS 163 అమలులో ఉంటుందని కూడా చెప్పారు. ఇక ప్రతీ పరీక్షా కేంద్రాలలో మూడు సీసీ కెమెరాలు పెట్టినట్లు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కు ఈ పరీక్షలు మార్చి 5న ప్రారంభమై మార్చి 25 వరకు జరుగుతాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,532 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 9,96,541 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందులో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4,88,316 మంది, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 5,08,225 మంది ఉన్నారు.
Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!