/rtv/media/media_files/2025/11/14/sangareddy-2025-11-14-09-17-12.jpg)
విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచాల్సిన హాస్టల్ వాచ్‌మెన్ తప్పతాగి నిద్రపోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో ఉంటున్న వాచ్‌మెన్ ఫుల్‌గా మద్యం సేవించాడు. ఆ మత్తులో అన్నం వండిన పాత్రలో కాలుపెట్టి నిద్రించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు భోజనం చేయడానికి వసతి గృహాంలోని భోజనశాలకు వెళ్లగా.. అక్కడ వాచ్‌మెన్ ఇలా కనిపించాడు. అయితే ఇలా జరగడం మొదటిసారి ఏం కాదు. గత కొన్ని నెలల నుంచి ఆ వాచ్‌మెన్ అలానే కాలు పెట్టి నిద్రిస్తున్నాడని విద్యార్థులు వంట కాంట్రాక్టర్‌కు కంప్లైట్ చేశారు. అతను మళ్లీ వంట చేసి విద్యార్థులకు వడ్డించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వెంటనే ఆ వాచ్‌మెన్‌ను విధుల నుంచి తొలగించారు.
ప్రభుత్వ కళాశాలలో మద్యం మత్తులో అన్నంలో కాలు వేసి పడుకున్న వాచ్‌మెన్
— Telugu Scribe (@TeluguScribe) November 14, 2025
మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట్ గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, మద్యం మత్తులో అన్నం పాత్రలో కాలు వేసి పడుకున్న వాచ్‌మెన్
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని విధులు నుండి తొలగించిన… pic.twitter.com/JluYhb3ig6
ఇది కూడా చూడండి: Vijayawada crime news: నడిరోడ్డు మీద పట్టపగలు.. భార్య గొంతు కోసం దారుణంగా హత్య చేసిన భర్త.. కారణమేంటంటే?
Follow Us