Breaking: ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన ఫిటిషన్ పై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.ఈ వ్యవహారంలో స్పీకర్ నిర్ణయంపై ఎలాంటి టైమ్ బాండ్ లేదని తెలిపింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. ఇక బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి వివేకానంద్ పిటిషన్లు దాఖలు చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..
ఈ మేరకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వ్యాజ్యాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం కొట్టివేసింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని స్పీకర్ నిర్ణయం తీసుకుకోవాలని తెలిపింది. ఐదేళ్ల అసెంబ్లీ గడువు దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
సింగిల్‌జడ్జి జోక్యం చేసుకోదు..
ఇక పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వీ.నర్సింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ సింగిల్‌జడ్జి సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పును కొట్టేయాలని దాఖలైన రెండు పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 12న వాదనలు ముగించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఇది కూడా చదవండి: కేసీఆర్ ఫ్యాన్స్ కు ఇక పండగే.. ఆ సినిమాలో గులాబీ బాస్ స్పెషల్ రోల్!
ఇక సింగిల్‌జడ్జి తీర్పును రద్దు చేయాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదించగా.. దీనిపై బీఆర్‌ఎస్ తరఫు సీనియర్ న్యాయవాదులు మోహన్‌రావు, జే రామచందర్‌రావు ప్రతివాదనలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో సింగిల్‌జడ్జి జోక్యం చేసుకోలేదన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు వెళితే స్పీకర్‌కు పిటిషన్ తీసుకోలేదని, అందువల్లే హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు.
ఇది కూడా చదవండి: పీఏసీ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. వైసీపీ సంచలన నిర్ణయం!