కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట

ఏసీబీ విచారణలో కేటీఆర్ తో పాటు లాయర్ ను అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. లాయర్ దూరం నుంచి కేటీఆర్ ను చూడొచ్చని తెలిపింది. సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది.

New Update
KTR HIGH COURT

కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లబించింది. సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆదేశించింది. విచారణ జరుగుతున్న సమయంలో లాయర్ లైబ్రరీ రూంలో కూర్చునేందుకు అనుమతి ఇచ్చింది. విచారణ జరుగుతున్న గదిలోకి లాయర్ కు అనుమతి ఉండదని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు రావచ్చునని కేటీఆర్ కు ధర్మాసనం సూచించింది.
ఇది కూడా చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ విడుదలపై జైళ్ల శాఖ డీజీ కీలక వ్యాఖ్యలు..

ఈ నెల 6న కేటీఆర్ ఏసీబీ విచారణ కోసం సంస్థ కార్యాలయానికి వెళ్లారు. తనతో పాటు లాయర్లకు కూడా అనుమతించాలని కోరారు. ఇందుకు ఏసీబీ అధికారులు నిరాకరించారు. దీంతో కేటీఆర్ విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగారు. లాయర్లను అనుమతించకపోతే ఏసీబీ అధికారులు తను చెప్పని విషయాలు కూడా చెప్పినట్లుగా చిత్రీకరించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Megha Company: దమ్ముంటే మేఘాను బ్లాక్ లిస్ట్ లో పెట్టు.. కేటీఆర్ సవాల్!

గతంలో పట్నం నరేందర్ రెడ్డి విషయంలోనూ పోలీసులు ఇలానే చేశారన్నారు. అయితే.. ఈ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరో వైపు విచారణకు న్యాయవాదాలను అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది. మరో వైపు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఒకటి రెండు రోజుల్లో విచారణ జరిగే అవకాశం ఉంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు