Telangana High Court Key Decision On TGPSC Group-1 తెలంగాణలో గ్రూప్-1 పరీక్షపై దాఖలైన అన్ని పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జీవో నంబర్.29తో పాటు పలు రిజర్వేషన్లపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ పిటిషన్లు తేలే వరకు పరీక్షలు కూడా నిర్వహించవద్దని ఆందోళనలు చేపట్టారు. రేవంత్ సర్కార్ మాత్రం పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీంతో అభ్యర్థులు ఆఖరి నిమిషంలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీం కోర్టు సైతం చివరి నిమిషంలో ఎగ్జామ్ ను వాయిదా వేయలేమని చెప్పింది. అయితే.. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ రోజు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో గ్రూప్-1 ఫలితాలకు లైన్ క్లీయర్ అయ్యింది. Also Read : ఆ ఒక్కటి తప్పా అన్నీ ఓకే.. టాలీవుడ్ పెద్దలతో రేవంత్ ఏమన్నారంటే?