/rtv/media/media_files/2025/10/31/batti-vikramarka-2025-10-31-20-13-56.jpg)
Telangana Govt Released Dues and Pending Bills worth Rs 1032 crores
ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, R & B శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులను రిలీజ్ అయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సుమారు రూ.1,031 కోట్లు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖలో 46,956 బిల్లులకు సంబంధించిన బిల్లులు విడుదలయ్యాయి. ఈ బకాయిలు, బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభుత్వం వీటికి సంబంధించిన నిధులు విడుదల చేసింది.
Follow Us