Land Registration :
భూముల రిజిస్ట్రేషన్ – మ్యూటేషన్ సమయంలో సంబంధిత భూమి మ్యాప్ జోడించడం తప్పనిసరి చేయాలనే తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం అమలు చేస్తే.. భూ వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లను అరికట్టవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తోంది. కర్ణాటకలో 2008 నుంచి దశల వారీగా దీన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం సత్ఫలితాలను కూడా అందిస్తోందని అక్కడి ప్రభుత్వం చెప్పింది.ఈ నేపథ్యంలోనే ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్ ఈ నెల 5న కర్ణాటక వెళ్లి.. అక్కడ రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేశారు. తెలంగాణ భౌగోళిక వాతావరణం, ప్రస్తుత చట్టాల్లో ఎలాంటి మార్పులు చేయొచ్చనే దానిపై ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రితో కూడా చర్చలు జరిపారు.
1936లో తెలంగాణ (Telangana) లో భూముల సర్వే జరిగింది. ఆ సమయంలో నిర్ణయించిన భూమి హద్దుల ఆధారంగానే ఇప్పటికీ కూడా వాటికి సంబంధించిన దస్త్రాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా భూముల సమగ్ర సర్వే చేపట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ పలు కారణాల వల్ల అడుగులు ముందుకు పడలేదు. దీంతో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేపట్టాలని యోచిస్తోంది. అయితే దీనికన్నా ముందు ఆర్వోఆర్ -2020, ధరణి పోర్టల్‌తో ఉత్పన్నమైన భూ యాజమాన్య హక్కులు, సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
Also Read : గణేశ్ నిమజ్జనోత్సవం.. సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
అయితే సమగ్ర సర్వే చేపట్టే లోపే భూ సమస్యలకు కొంతవరకైనా అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కమిటీ సభ్యులు చర్చించిన అనంతరం ఈ విధానంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా.. కొన్ని జిల్లాల్లో సర్వే చేయని భూమి కూడా ధరణి పోర్టల్‌లో నమోదైంది. కొందరు రైతుల ఖాతాల్లో భూమి విస్తీర్ణం కూడా పెరిగి ఉంది. రెవెన్యూ సెటిల్‌మెంట్ రిజిస్టర్‌లో కన్నా ఎక్కువ లేదా తక్కువ భూమి నమోదైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కువగా రికార్డయిన భూమిని తొలగించాలన్నా కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకే భూమి ఇద్దరి మీది రిజిస్టర్ అవ్వకుండా ఉండేందుకు నోటీసులు జారీ చేసి ఇలాంటి సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ నోటిసులు ఇచ్చే అధికారం అధికారులకు లేదు. చట్టంలో చూసుకుంటే ఈ రూల్ ఎక్కడా కనిపించదు.
Also Read : సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే.. మరోసారి రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి!
క్షేత్రస్థాయిలో పరిశీలన అవసరం లేకుండానే ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్- మ్యుటేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఒకవేళ భూమి మ్యా్ప్ జోడిస్తే.. ఏ భూమికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క భూమిని ఇద్దరికి అంటే డబులు రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి పట్టా భూమల్లో కలుపుకోవం.. అలాగే ఇతరుల భూముల హద్దులను చెరిపివేయడం లాంటి వివాదాలుకు కూడా అడ్డుకట్ట వేయొచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి.
Also Read : ట్రాన్స్‌జెండర్లకు సీఎం రేవంత్ బంఫర్ ఆఫర్..