Hydra: హైడ్రా ఎఫెక్ట్.. భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు!
తెలంగాణలో హైడ్రా ఎఫెక్ట్‌తో భూముల రిజిస్ట్రేషన్ భారీగా తగ్గిపోయింది. జులైతో పోలిస్తే ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ల ఆదాయం దాదాపు రూ.320 కోట్లు తగ్గినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జులైలో 58 వేల రిజిస్ట్రేషన్లు కాగా.. ఆగస్టులో 41 వేల 200 మాత్రమే అయినట్లు వెల్లడించారు.