/rtv/media/media_files/2025/01/13/qa5pGQkwOLDni36JJ4k2.jpg)
CM Revanth
Telangana Pending DAs:
తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు పెండింగ్ లో ఉన్న డీఏలలో రెండు చెల్లించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఉద్యోగుల రిటైర్మెంట్ రోజునే బెనిఫిట్స్ లో కొంత మొత్తం చెల్లించనున్నట్లు తెలిసింది. త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
రేపు జరగనున్న క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనున్నదని ఉద్యోగ సంఘాల వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగుల కోరిక మేరకు ఆరోగ్య పథకం ప్రకటించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించినట్లుగా తెలుస్తో్ంది. కాగా ఉద్యోగ సంఘాల నేతలు ఒక్కటిగానే ఉండాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!