Telangana Pending DAs: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు డీఏలు!
తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు పెండింగ్ లో ఉన్న డీఏలలో రెండు చెల్లించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఉద్యోగుల రిటైర్మెంట్ రోజునే బెనిఫిట్స్ లో కొంత మొత్తం చెల్లించనున్నట్లు తెలిసింది.