మహిళా విశ్వవిద్యాలయం అని చెప్పి.. ప్రస్తుతం ఓయూ పేరుతో సర్టిఫికేట్‌లు ఇస్తున్నారని ఇటీవల సిటీ కాలేజీ విద్యార్థులు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఓయూ పేరుతో కాకుండా యూజీసీ గుర్తింపు పొందిన వీరనాలి చాకలి ఐలమ్మ అయిన మహిళా వర్సిటీ పేరు మీదనే ఇవ్వాలని సిటీ కాలేజీ విద్యార్థులు కోరారు.
ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!?
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మహిళా వర్సిటీ బిల్లును..
అయితే త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో మహిళా వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి కూడా వర్సిటీ కోసం ఓ నివేదికను పంపినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా మార్చాలని 2022లో ఓ జీఓ కూడా జారీ చేశారు.
ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు!
కానీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా బిల్లును ప్రవేశపెట్టలేదు. ఇంతలో గతేడాది విద్యార్థుల చదువు పూర్తి కావడంతో వారికి సర్టిఫికేట్లు ఇవ్వాలి. దీంతో వివాదం మళ్లీ చెలరేగడంతో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే బిల్లును ప్రవేశ పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం!
మహిళా వర్సిటీ పేరుతో సర్టిఫికేట్లు ఇవ్వాలంటే ముందుగా వర్సిటీకి ఓ చట్టం ఉండాలి. దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లును ఆమోదిస్తే.. యూజీసీకి పంపాలి. చివరకు యూజీసీ ఆమోదించిన తర్వాత యూజీసీ పేరుతో పట్టాలు ఇవ్వవచ్చు. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్ అయిన పెద్ద పాదం మార్గం!