BIG BREAKING: కర్నూలు బస్సు ప్రమాదంపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామన్నారు.

New Update
Ponnam Prabhakar

Ponnam Prabhakar

కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల వేగం నియంత్రించడానికి చర్యలు చేపడతామని తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో త్వరలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక మంత్రుల సమావేశం నిర్వహిస్తామన్నారు. బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. ఓవర్ స్పీడ్‌ నియంత్రణకు కమిటీ వేస్తామని తెలిపారు. ప్రైవేటు ట్రావెల్స్‌ మధ్య అనారోగ్యకర పోటీ ఉందని, దాన్ని నివారిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు వచ్చాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

రెండు తెలుగు రాష్ట్రాలను కన్నీరు పెట్టిస్తున్న కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ కావేరి బస్సు అగ్ని ప్రమాదానికి గురై 20 మంది సజీవదహనమైయ్యారు. బస్సులో మంటలు అంటుకోగానే డ్రైవర్, కో డ్రైవర్ ప్రయాణీకులను వదిలిస్తే అక్కడి నుంచి పారారైయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున 2.40 నిమిషాలకు బైక్‌ని ఢీకొట్టింది. దాన్ని నడిపిన వ్యక్తి బైక్‌తోపాటు బస్సు కింద పడిపోయాడు. బస్సు ఇంజిన్ ముందు బాగంలో ఇరుక్కిపోయిన బైక్‌ని కొద్ది దూరం అలాగే ఈడ్చుకేళ్లాడు డ్రైవర్. దీంతో బస్సు ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సంతా వ్యాపించాయి. ఈ క్రమంలో బస్సులోని డ్రైవర్, కోడ్రైవర్‌ను బస్సు దిగి పారిపోయారు. 

Advertisment
తాజా కథనాలు