Indiramma Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

TG: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సొంత జాగాతో పాటు రేషన్ కార్డు ఉంటేనే ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం.

New Update
Revanth indiramma

Telangana : ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్ ను రేవంత్ సర్కార్ పెట్టినట్లు తెలుస్తోంది. సొంత జాగాతో పాటు రేషన్ కార్డు ఉంటేనే ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రేషన్ కార్డు లేనివారి నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉండటంతో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

ఇది కూడా చదవండి: Diwali 2024: దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?

కాగా ప్రస్తుతం ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల ఊసే తీయడం లేదు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  ఇందులో రేషన్‌కార్డు లేనివారు 30 లక్షల మంది ఉన్నట్లు సమాచారం. సొంత జాగాలేని పేదలకు స్థలం ఇచ్చి మరీ ఇల్లు నిర్మించి ఇస్తామని మొదట్లో ప్రకటించినా.. ఈ ఏడాది సొంత జాగా ఉన్నవారికే ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: దీపావళి రోజున ఈ మూడు వస్తువులను ఖచ్చితంగా కొనండి

రేషన్ కార్డుల కోసం...

తెలంగాణలో రేషన్ కార్డు కోసం ఎదురుచూపులు చూస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం ఇచ్చే పథకాలకు అర్హులు కావడానికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో దీనికి కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా ఈ సంఖ్య ఇంతలా పెరిగిపోవడానికి గల కారణాల్లో ముఖ్యమైంది.. కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయకపోవడం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి విభజన అయ్యి నూతన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన సమయంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా 6,47,479 కార్డులు జారీ చేసింది. కాగా అదే సమయంలో వివిధ కారణాలతో 5,98,000 కార్డులను రద్దు చేసింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 89,98,546 రేషన్‌ (ఆహారభద్రత) కార్డులు ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ జనాభా దాదాపు 4 కోట్లకు పైనే ఉంటోంది. అందులో ప్రస్తుతం..  ఉన్న రేషన్‌కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2010-11 లెక్కల ప్రకారం.. రాష్ట్ర జనాభాలో 71.47 శాతం మంది ఆహారభద్రత పరిధిలో ఉన్నారు. 

Also Read :  పండుగ రోజు మరింత పతనం.. నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లో ట్రేడ్

Also Read :  బిగ్ సెల్యూట్.. 'అమరన్' మూవీ పై CM ప్రశంసలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు