బిగ్ సెల్యూట్.. 'అమరన్' మూవీ పై CM ప్రశంసలు!

మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'అమరన్'. నేడు దీపావళి కానుకగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా తమిళనాడు CM స్టాలిన్ 'అమరన్' పై ప్రశంసలు కురిపించారు. చిత్ర బృందానికి అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు.

New Update

Also Read: యువరాణిలా ముస్తాబైన నటి.. కేతిక శర్మని ఇలా చూస్తే అంతే సంగతి!

CM స్టాలిన్ ప్రశంసలు

తాజాగా 'అమరన్'  సినిమా పై తమిళనాడు ముఖ్యంమత్రి స్టాలిన్ సైతం ప్రశంసలు కురిపించారు. చిత్రబృందాన్ని అభినందిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. "నా ఆర్టిస్ట్ స్నేహితుడు కమల్ హాసన్ అమరన్ అంగీకరించి నిన్న అమరన్ సినిమా చూశాను. నేటి యువతరానికి పుస్తకాల రూపంలో, సినిమాల రూపంలో వాస్తవ కథలను అందించడం విశేషం! దర్శకుడు రాజ్ కుమార్ ఆర్మీ వెటరన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ శౌర్యాన్ని, దేశం పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని చాలా  భావోద్వేగంగా చూపించారు. హీరో శివకార్తికేయన్ కు నా అభినందనలు. నటి సాయి పల్లవి ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రను చాలా చక్కగా పోషించారు. చిత్ర బృందానికి నా అభినందనలు. దేశాన్ని రక్షించే మన సైనికులకు బిగ్ సెల్యూట్.. మన స్మృతిలో నివసించే మేజర్ ముకుంద్ వరదరాజన్" అంటూ సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు.  ఈ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్  సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.

Also Read:జిల్ జిల్ జిగేల్.. టాలీవుడ్ స్టార్లు దీపావళి విషెస్ ఎలా చెప్పారో చూడండి!

ఇది కూడా చూడండి:  గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే?

Advertisment
తాజా కథనాలు