Musi River: మూసీ సుందరీకరణ బాధితులకుభరోసాగా ఉండేందుకు రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. భూములు, ఇళ్లు కోల్పోయే వారికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉండనుంది. తెలంగాణ భూసేకరణ, సహాయ, పునరావాస నిబంధనల ప్రకారం సాయం అందించేందుకు సిద్ధమైంది. భూసేకరణ చట్టం - 2013 ప్రకారం పరిహారంతో పాటు బాధితుల కోసం 15వేల ఇళ్లను కేటాయించనుంది. ఈ క్రమంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి టోకన్ సాహు ప్రకటించారు. ఎంపీ సురేష్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!
కూల్చివేతలు హైకోర్టు లైన్ క్లియర్...
మూసీ సుందరీకరణకు అడుగులు ముందుకు పడనున్నాయి. ఇకపై పనులు చకచకా జరగనున్నాయి. మూసీ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలు తొలగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను తొలగించడం తో పాటు కలుషిత నీరు నదిలో కలవకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సుందరీకరణతో ఎవరి ఆస్తులు పోతున్నాయో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి పేదలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు!
మూసీనదీగర్భం, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో చట్టవిరుద్దంగా, అనధికారికంగా ఉన్న నివాసాలను ఖాళీ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మురుగునీరు, కలుషిత నీరు రాకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఎవరి ఆస్తులైతే ప్రభావితమవుతాయో వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని పేర్కొంది. ఆక్రమణలో ఉన్న పట్టాభూములు, శిఖం భూములైతే వారికి సమాచారం ఇవ్వడం లేదా ఆ భూయజమానులకి నోటీసులు జారీచేసి చట్టం ప్రకారం తగిన పరిహారం చెల్లించడం ద్వారా సేకరించాలని అధికారులను ఆదేశించింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా నివాసాలు ఖాళీ చేయించడంతో పాటు , కూల్చివేతలను సవాల్‌చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టి తీర్పు ని ప్రకటించారు.
Also Read: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం- కేటీఆర్
Also Read: కులగణన సర్వే.. రేవంత్ ప్రభుత్వానికి కవిత కీలక డిమాండ్లు