మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు విడుదల!

మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి వడ్డీలేని రుణాలు తీసుకున్న వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. గత ఫిబ్రవరి, మార్చి నెలలకి సంబంధించిన మొత్తం వడ్డీ రూ.30.70 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ కానున్నాయి.

Revanth 5
New Update

తెలంగాణ: రేవంత రెడ్డి సర్కార్ మహిళలకు శుభవార్త తెలిపింది. మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న వడ్డీలేని రుణాలను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. గత ఫిబ్రవరి, మార్చి నెలలకి సంబంధించిన మొత్తం వడ్డీ రూ.30.70 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే త్వరలో ఈ డబ్బులు మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి.

ఇది కూడా చూడండి: మళ్లీ పెళ్లి చేసుకోనున్న జెఫ్ బెజోస్.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

ఈ జిల్లాల్లో ఎక్కువగా..

ఎక్కువగా నల్గొండ జిల్లాలో 5283 గ్రూపులకు మొత్తం రూ.1.99 కోట్లు విడుదల చేసింది. నిజమాబాద్ జిల్లాలో 2010 గ్రూపులకు రూ.1.91 కోట్లు, కరీంనగర్ జిల్లాలో 3291 గ్రూపులకు రూ.1.55 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3983 గ్రూపులకు రూ.1.66 కోట్లు త్వరలో మహిళల అకౌంట్లోకి జమకానున్నాయి.  

ఇది కూడా చూడండి:  మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే

ఇదిలా ఉండగా.. కులగణన ఎక్స్‌రే కాదని మెగా హెల్త్ క్యాంప్ లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు తొలగించమని.. దీంతో ఎవరికీ ఇబ్బంది ఉండదని తెలిపారు. కులగణనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావడానికి కులగణన అవసరం అని స్పష్టం చేశారు మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమాజంలో మార్పులకు అనుగుణంగానే ఈ సర్వే చేపట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కావాలంటే కులగణన జరగాలని అన్నారు.

ఇది కూడా చూడండి:  Gold Price Today: మహిళలకు బంపరాఫర్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

అలాగే తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలని రేవంత్ రెడ్డి చెప్పారు. కులగణనపై అపోహలు తొలగించే బాధ్యత విద్యార్థులదేనని.. మీ తల్లిదండ్రులకు, చుట్టుపక్కలవారికి కులగణనపై అవగాహన కల్పించాలని సీఎం పిలుపునిచ్చారు. ఎవరు అడ్డు వచ్చినా కులగణన ఆగదని.. 2025లో జరిగే జనగణనలో కూడా కులగణన చేసేలా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని హాట్ కామెంట్స్ చేశారు. కులగణనతో ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని.. ఎవరి ఆస్తులు తీసుకోమని క్లారిటీ ఇచ్చారు.

ఇది కూడా చూడండి: మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు విడుదల!

#telangana #revanth-reddy #Women Self Help Societies
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe