Cyber Crime: తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్‌.. ఐదు రాష్ట్రాల్లో 81 మంది అరెస్టు

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌ చేపట్టింది. ఐదు రాష్ట్రాల్లో  నిర్వహించిన ఆపరేషన్‌ లో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న 81 మందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్‌ అయిన వారు ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని వెల్లడించింది.

New Update
Cyber criminals

Cyber ​​criminals

Telangana Cyber ​​Security Bureau Operation

Cyber Crime:  తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌ చేపట్టింది. ఐదు రాష్ట్రాల్లో  నిర్వహించిన ఈ కీలక ఆపరేషన్‌ లో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న 81 మందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్‌ అయిన వారు ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు తెలిపారు. నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వారు మొత్తం రూ.95 కోట్ల విలువైన మోసాలు చేసినట్లు గుర్తించారు.  

కాగా పట్టుబడ్డ నిందితుల్లో 17 మంది ఏజెంట్లు, ఏడుగురు మహిళలున్నారని తెలిపారు. 58 మంది మ్యూల్ ఖాతాదారులున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 84 సెల్‌ఫోన్లు, 101 సిమ్‌ కార్డులు, 89 బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుల ఖాతాల్లో ఉన్న రూ.కోట్ల నగదును ఫ్రీజ్‌ చేశారు. దీన్ని సైబర్‌ సెక్యూరిటీ cబ్యూరో బాధితులకు అందించనున్నట్లు తెలిపారు.

 నిందితుల్లో పలు రంగాల వారు ఉన్నారని వారిలో  బ్యాంక్‌ ఉద్యోగులు, ఐటీ సిబ్బంది, ప్రైవేట్‌ ఉద్యోగులు, బ్రోకర్లు, విద్యార్థులు, రోజువారీ కూలీలు కూడా ఉన్నారన్నారు.ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగులు 106 కేసులకు సంబంధించి ఈ నేరాలలో నేరుగా పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు ఈ ఆపరేషన్‌లో 7 సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లలో 41 కేసులు నమోదు అయ్యాయి. కొందరు నిందితులకు విదేశీ సంబంధాలు ఉన్నట్లు గుర్తించగా, వారిపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్లు (LOCs) జారీ చేయడానికి చర్యలు ప్రారంభినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నట్లు గుర్తించారు. టీజీసీఎస్బీ అధికారులు దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలను ఛేదించడంలో ఇది మరో మైలురాయిగా నిలిచిందని శిఖ గోయల్ పేర్కొన్నారు.

Also Read :  అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. లక్ష సుపారీ ఇచ్చి భర్తను లేపేసింది!

Advertisment
తాజా కథనాలు