/rtv/media/media_files/2025/09/13/congress-2025-09-13-19-45-45.jpg)
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. బీఆర్‌ఎస్ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు.
అయితే స్పీకర్ నోటీసులకు పార్టీ మారిన కొంతమంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, కేవలం తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించామని పేర్కొన్నారు. తాము ఇంకా బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నామని సాంకేతికంగా వాదిస్తున్నారు. ఈ ఎమ్మెల్యేల వాదనను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని, సమావేశాల్లో కూడా పాల్గొన్నారని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.
బైఎలక్షన్స్ లో తామే గెలుస్తామని ధీమా
కాంగ్రెస్‌లో చేరకపోతే అసెంబ్లీలో ప్రతిపక్షానికి బదులుగా అధికార పక్ష బెంచ్‌లలో ఎందుకు కూర్చున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ వంటి ఎమ్మెల్యేలు తమ వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కోరారు. వీరిద్దరూ ఇప్పటికే తాము పార్టీ మారమని బహిరంగానే ఒప్పుకున్నారు. ఏకంగా దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగానే పోటీ చేశారు. ఇక కడియం కూడా ఎమ్మెల్సీ కవిత వ్యవహారం వల్లనే తాను పార్టీ మారినట్లుగా ప్రకటించారు.
అవసరమైతే ఉప ఎన్నికలు వస్తే తప్పుకుండా చూసుకుందామని, బైఎలక్షన్స్ లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ ఇద్దరు నేతలు. దానం, కడియంలతో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తోందట. వచ్చే ఉప ఎన్నికలో వీరికే టికెట్ కేటాయించి గెలుపించుకుని బీఆర్ఎస్ అధిష్టానానికి బిగ్ షాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read : Liquor smuggle: వాటే థాట్.. పిచ్చోళ్లు అయిపోవాల్సిందే.. ఒంటెలపై మద్యం అక్రమ రవాణా