/rtv/media/media_files/2025/03/09/UFTVjyxi5DwPg4nrEaDi.jpg)
Telangana congress MLC candidate Addanki Dayakar political journey
Addanki Dayakar: ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఫలితం దక్కింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అద్దంకిని MLC అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా అద్దంకి రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో 15అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ సంధర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అంబేద్కర్ ఓపెన్ వీసీ ఘంటా చక్రపాణి గారు పాల్గొనడం జరిగింది. pic.twitter.com/oI3G5hSDxm
— Addanki Dayakar (@ADayakarINC) January 26, 2025
రెండుసార్లు ఓడినా..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో తన అసలైన రాజకీయం ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2014, 2018లో పోటీ చేసి ఓడిపోయారు. 1,847 ఓట్లతో, 2,379 స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన ఆయనకు 2023లో టికెట్ దక్కలేదు.
తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా భవన్ జరిగిన యంగ్ ఇండియా కే బోల్ సీజన్ - 5 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.. సందర్భంగా తెలంగాణ యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.@INCIndia@RahulGandhi@priyankagandhi@revanth_anumula@MNatarajanINCpic.twitter.com/gA403JTfVg
— Addanki Dayakar (@ADayakarINC) March 4, 2025
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం నెమ్మికల్ గ్రామానికి చెందిన అద్దంకి దయాకర్ ఎం.కామ్, ఎం సి ఎ, ఎల్ఎల్‌బి, పిహెచ్.డి చదివి డాక్టర్ పట్టా పొందారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధిగా విధులు నిర్వర్తించారు. జతీయ మాలమహానాడు వ్యవస్థాపకులుగా ఉన్నారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) లో అధికార ప్రతినిధి పనిచేశారు. ప్రస్తుతం ఇండియన్ ఫైల్స్ సినిమా విడుదల సిద్ధంగా ఉంది. ఇక రాజకీయ జీవితం 2014 లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీకి బలమైన గొంతు..
అయితే రేవంత్ సర్కార్‌లో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీకి బలమైన గొంతుగా ఉన్నా అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే తుంగతుర్తి ఎమ్మెల్యేగా టికెట్ వస్తుందని ఆశించిన అద్దంకికి నిరాశ ఎదురైంది. అప్పటి నుంచి వరుసగా నిరాశలే. కంటోన్మెంట్ ఉపఎన్నిక వేళ,ఆ తర్వాత ఎంపీల ఎన్నికల సమయంలో, మరోసారి ఎమ్మెల్సీల ఎన్నికల్లో ప్రతిసారి మొండిచేయి ఎదురైంది. చివరగా కార్పోరేషన్ ఛైర్మన్ పదవి అయినా ఇస్తారని ఆశించినా ఆది కూడా దక్కకపోవడంతో అతని స్థానం ప్రశ్నార్థకమవుతోందని అద్దండి వర్గం ఆందోళన వ్యక్తం చేసింది.
అద్దంకి వివాదాలు..
మునుగోడు నియోజకవర్గం చండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో ఆయన కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటే ఉండు.. లేకపోతే దెంగేయ్ అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వాడిన పదాలపై పార్టీలో తీవ్ర విమర్శలు రావడంతో కోమటిరెడ్డి అభిమానులు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారున. దీంతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి అద్దంకి దయాకర్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న తరువాత దయాకర్ స్పందిస్తూ తాను ఏదో ఆవేశంలో నోరు జారి అలా మాట్లాడానని తాను వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. వెంకట్ రెడ్డికి వ్యక్తిగతంగా బేషరతుగా క్షమాపణలు చెప్పారు.