/rtv/media/media_files/2025/01/15/VmzV35EtBgIXkHRikOkL.jpg)
Telangana Common Entrance Exams
TG EAPCET 2025: బీటెక్, బీఫార్మసీ, ఫామ్.డీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈఏపీసెట్ ను-TG EAPCET జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహించనుంది. ఇందులో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు.
TG ECET 2025: బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో ఏడాదిలో లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించే ఈసెట్-TG ECET పరీక్షను మే 12న ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
TG Ed.CET 2025: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్-TG Ed.CET పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. జూన్ 1న ఈ పరీక్ష ఉంటుందుని ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
ఇది కూడా చదవండి: New Telecom Rule: కొత్త టెలికాం రూల్.. సిమ్ కార్డ్ తీసుకునేవారికి వారికి ఇది పక్కా
Schedule of TG Common Entrance Tests-2025 released. #EAPCET to be conducted from April 29 #Telangana #CETs @TOIHyderabad @TSEduDept @timesofindia pic.twitter.com/Px6ouPZxsN
— Nirupa Vatyam (@NirupaTOI) January 15, 2025
TG LAWCET 2025: మూడు, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే లాసెట్- TG LAWCET పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ పరీక్షను జూన్ 6న నిర్వహించనున్నట్లు తెలిపింది.
TG ICET 2025: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్-TG ICET పరీక్షను మహాత్మా గాంధీ యూనివర్సిటీ జూన్ 8,9 తేదీల్లో నిర్వహించనుంది.
TG PGECET: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే-TG PGECET పరీక్షను జూన్ 16 నుంచి 19 వరకు జేఎన్టీయూ హచ్ నిర్వహించనుంది.
ఇది కూడా చదవండి: Khammam Kidnap Case: ఖమ్మం కిడ్నాప్ కేసు విషాదాంతం.. శవమై తేలిన సంజయ్, గ్రామస్థుల ఆందోళన
ప్రత్యేక నోటిఫికేషన్లు..
ఆయా పరీక్షల కన్వీనర్లు పూర్తి షెడ్యూల్, అర్హత, రిజిస్ట్రేషన్ తదితర వివరాలను ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా విడుదల చేస్తారని ఉన్నత విద్యామండలి ప్రకటించింది.