Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు.
Telangana: రైతుబంధుపై సందిగ్ధత.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..
రైతుబంధు అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రైతు బంధు పొందుతున్నప్పటికీ.. మళ్లీ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సీఎం చెప్పారు. ప్రస్తుతానికి భూమి ఎంత ఉన్నా రైతు భరోసా ఇస్తామన్నారు. భవిష్యత్తులో భూమి విస్తీర్ణానికి సీలింగ్ పెట్టే అవకాశం ఉందన్నారు.
Telangana: సోనియాతో సీఎం రేవంత్ భేటీ.. ఆ విషయాలపైనే ప్రధాన చర్చ..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ పదవులు, మంత్రి పదవుల ఖాళీల భర్తీపై చర్చించారు. సీఎం ఢిల్లీ నుంచి వచ్చాక మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది.
Telangana: ఆటో, క్యాబ్ డ్రైవర్స్, డెలివరీ బాయ్స్‌కి సీఎం రేవంత్ బంపర్ ఆఫర్..
గిగ్ వర్కర్లకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆటో, క్యాబ్ డ్రైర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్‌కి రూ. 5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు.
Telangana: సీఎం రేవంత్ రెడ్డికి చిన్నారి లేఖ.. ఏం కోరిందంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని లేఖ రాసింది. తన పుట్టిన రోజు నాడు సీఎంను ఓ కోరిక కోరింది. తమ ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందించాలని వేడుకుంది. మరి దీనిపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠగా మారింది.
ఆ విషయంలో సిద్దిపేట ఫస్ట్, గజ్వేల్ సెకండ్.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..
తెలంగాణలో విద్యుత్ బకాయిల్లో సిద్దిపేట టాప్‌లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండవ స్థానంలో గజ్వేల్, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. దీనిపై చర్చ హాట్ హాట్ జరిగింది.
Telangana: డీహెచ్ శ్రీనివాస్‌కు సీఎం షాక్.. కొత్త డైరెక్టర్‌గా డా.రవీంద్ర నాయక్..
తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా గడ శ్రీనివాస్‌ను తొలగించింది ప్రభుత్వం. ఆయన స్థానంలో డాక్టర్ రవీంద్ర నాయక్‌ను హెల్త్ డైరెక్టర్‌గా నియమించింది. మెడికల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్‌గా త్రివేణిని నియయించింది సర్కార్.
Telangana: ఢిల్లీలో తెలంగాణ భవన్.. అధికారులతో సీఎం కీలక సమీక్ష..
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ భవన్‌ను నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం. అలాగే, ఉమ్మడి ఆస్తుల విభజనపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.