/rtv/media/media_files/2024/10/29/vvL4OC3WckdAqbHxszs0.jpg)
Potholed Road
Potholed Road: రానురాను రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్నాయి. ఎటుచూసినా అడుగుకో గుంత కనిపిస్తోంది. వరుసగా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడంతో కొందరు వినూత్నంగా నిరసన చేపట్టారు. యముడు, చిత్రగుప్తుడి వేషంలో గుంతల రోడ్డుపై లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. నరకంలో ఉన్న పాపులంతా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రోడ్ల దుస్థితి అధికారులకు తెలియజేసేందుకే..
కర్నాటకలోని ఉడిపి-మల్పే రోడ్డులో ఈ వీడియో తీశారు. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. అంతేకాకుండా నీళ్లు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రోడ్ల దుస్థితి గురించి అధికారులకు తెలియజేసేందుకే ఈ వీడియో చేశామంటున్నారు. వీడియోలో ఇద్దరు యమధర్మరాజు, చిత్రగుప్తుడి గెటప్‌లో ఉండగా.. మరికొందరు దెయ్యాల్లా వేశం వేసుకుని గుంతలపై లాంగ్‌జంప్ చేస్తున్నారు.
Yamaraja conducts long jump competition for the dead in Udupi, Karnataka. pic.twitter.com/MLBxCuZoZn
— Karthik Reddy (@bykarthikreddy) August 27, 2024
అంతేకాకుండా చిత్రగుప్తుడు, యముడు కలిసి ఒక టేపు తీసుకుని ఎవరు ఎంతదూరం జంప్ చేశారో కూడా కొలవడం చూడవచ్చు. హైదరాబాద్‌లోనూ రోడ్ల దుస్థితిని చెప్పేందుకు ఒక మహిళ గుంతల్లో నిల్వ ఉన్న నీటిలో స్విమ్మింగ్‌పూల్ తరహాలో స్నానం చేయడం వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఏపీలో కూడా రోడ్లు బాగోలేవంటూ ప్రతిపక్షాలు అప్పట్లో వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
ఇది కూడా చదవండి: డైపర్లతో పిల్లలకు దొడ్డికాళ్లు వస్తాయా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: 10 నిమిషాల రన్నింగ్‌తో ఆ ప్రమాదకరమైన వ్యాధులు దూరం