CM Revanth Reddy: రేపే 4 కొత్త పథకాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

ప్రతి లబ్ధిదారుడికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న  మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు.

New Update
CM Revanth

CM Revanth

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అందాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవం జనవరి 26న ప్రజా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న  మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు. జనవరి 26న రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక గ్రామంలో నూటికి నూరు శాతం అమలు చేయడం ద్వారా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రులు తెలిపారు.

రేపటి నుంచి మార్చి వరకు..

కొత్తగా లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున జనవరి 26 నుంచి మార్చి వరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు