తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. నెలాఖరు నుంచే రైతు భరోసా..

రైతు భరోసా నగదును ఈ నెలాఖారున అకౌంట్లోకి జమ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.7500 చొప్పున పంపిణీ చేయనున్నారు. అయితే నిధులు లేకపోవడం వల్లే రైతు భరోసా ఆలస్యం అయ్యినట్లు సమాచారం.

New Update

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెలాఖరు నుంచే రైతు భరోసా అమలు చేస్తామని తెలిపింది. నవంబరు చివరన రైతుల అకౌంట్లోకి రైతు భరోసా నగదు జమ అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.7500 చొప్పున పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చూడండి: ఏపీలో ఫించన్‌దారులకు బంపర్‌ ఆఫర్‌.. మూడు నెలల పెన్సన్ ఒకేసారి!

గైడ్‌లైన్స్‌పై డ్రాఫ్ట్ నోట్ సిద్ధం..

రైతు భరోసా పథకం కింద పది ఎకరాలు ఉన్నవారికా? లేకపోతే ఏడున్నర ఎకరాలు ఉన్నవరకే? వస్తుందనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. గైడ్‌లైన్స్‌పై కేబినేట్ సబ్ కమిటీ డ్రాఫ్ట్ నోట్ సిద్ధం చేసింది. దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లు స్వాహా

రైతు భరోసా కింద రూ.7వేల కోట్ల నిధులు అవసరం. దీనికి సీఎం రేవంత్ ఇప్పటికే ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి దసరా నుంచి రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ నిధులు సర్దుబాటు కాకపోవడంతో నవంబర్ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల కంటే ముందే నిధులు రైతుల అకౌంట్లోకి జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి:  నేడు కార్తీక సోమవారం.. శివుడిని ఎలా పూజించాలంటే?

ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కులగణనపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు వెంటనే డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చూడండి:  విషాదం.. గొంతులో కోడి గుడ్డు ఇరుక్కుని..

 

#raithu-bharosa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe