సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం తెలంగాణ రాష్ట్రమంత్రులు భేటి అయ్యారు. కేబినెట్ 5 ఆర్డినెన్సులకు ఆమోదం తెలిపింది. వాటిలో రైతు భరోసా, కొత్త ఆర్ఓఆర్ చట్టం వంటి అంశాలపై మంత్రులు సుదీర్ఘ చర్చ జరిపారు. Also Read: వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి ఓఆర్ఆర్(ORR) పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనానికి ఆమోదం తెలిపారు. రైతు భరోసాపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. Also read: సోనియా గాంధీ తీసుకున్న నెహ్రూ లేఖలు అప్పగించండి: కేంద్రం