TGPSC Group-1: గ్రూప్-1 రద్దు.. రేవంత్ సర్కార్ కు కవిత సంచలన లేఖ!

గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 21,075 మంది మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించిందన్నారు. కానీ 21,085 మంది ఫలితాలను విడుదల చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు.

New Update
TGPSC Group-1 MLC Kavitha

TGPSC Group-1 MLC Kavitha

గ్రూప-1 పరీక్షకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టి వేయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత లేదని ఈ వ్యవహారంలో తేటతెల్లమైందన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించిందని ఆరోపించారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడడం సరికాదన్నారు. గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్ నెంబర్ల కేటాయింపుతో గందరగోళం ఏర్పడిందన్నారు.

అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగింది?

21,075 మంది మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించిందన్నారు. కానీ, ఫలితాలు ప్రకటించే సరికి ఆ అభ్యర్థుల సంఖ్య 21,085 మందికి చేరిందన్నారు. ఈ పది మంది అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగిందని.. అనుమానం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయో చెప్పాలన్నారు. సదరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్‌ పరీక్షలకు హాజరు అయ్యారా? లేదంటే తర్వాత వారిని తెచ్చి చేర్చారా? అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొందన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనంపై సైతం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. 

దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లతో వ్యాల్యుయేషన్‌ చేయిస్తామని తొలుత టీజీపీఎస్సీ ప్రకటించిందన్నారు. కానీ రిటైర్డ్‌ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపై అభ్యర్థుల్లో అనుమానాలున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన టీజీపీఎస్సీ తర్వాత ఒక సెంటర్‌ ను పెంచిందన్నారు.

కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్‌ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉందని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆ రెండు పరీక్ష కేంద్రాల్లో 71 మంది ఉద్యోగాలకు ఎంపికైనది నిజమేనని TGPSC కూడా అంగీకరించిందన్నారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు కూడా గుర్తించి నియామక ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు. 

(tgpsc-group-1 | telangana | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు