ఎన్నికలు ఎలా పెడతావో చూస్తా.. రేవంత్ కు కవిత వార్నింగ్!

బీసీల రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అలా అయితే ఎన్నికలు జరగనివ్వమన్నారు. ఈ రోజు బీసీ సంఘాలతో సమావేశం అయ్యారు. బీసీల జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచించాలన్నారు.

New Update

బీసీలకు రిజర్వేషన్లు పెంచకుంటే స్థానిక ఎన్నికలు జరగనివ్వమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ సర్కార్ ను హెచ్చరించారు. ఈ రోజు బీసీ సంఘాలతో ఆమె సమావేశం అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొందన్నారు. బీసీల జనాభా ఎంతో తెలియంది హామీ ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారన్నారు. కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదన్నారు. ఆ 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
ఇది కూడా చదవండి: CM Revanth: CWC సమావేశం.. సీఎం రేవంత్ ప్రతిపాదనకు హైకమాండ్ ఆమోదం

అప్పటి వరకు స్థానిక ఎన్నికలు వద్దు..

42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాకా, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలన్నారు. అంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదన్నారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తామన్నారు. 
ఇది కూడా చదవండి: తెలంగాణ భక్తులపై TTD నిర్లక్ష్యం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!

జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏటా రూ. 20 వేల కోట్లు బీసీలకు బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయన్నారు. ప్రధాన డిమాండ్ గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదన్నారు కవిత.  

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు