తెలంగాణ ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని చెప్పారు. పెద్దలను వదిలేసి పేదలను రోడ్డున పడేస్తున్న హైడ్రాను సహించేదిలేదన్నారు.
TG News: తెలంగాణ ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని చెప్పారు. పెద్దలను వదిలేసి పేదలను రోడ్డున పడేస్తున్న హైడ్రాను సహించేదిలేదన్నారు. దమ్ముంటే బడాబాడుల ఇండ్లు కూలగొట్టాలని సవాల్ చేశారు. ఈ మేరకు జవహార్ నగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు.
📍 జవహర్ నాగర్, మల్కాజిగిరి పార్లమెంట్.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా జవహార్ నగర్ లో బీజేపీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాను.
ఇక్కడ ఉన్నవాళ్ళం ఎక్కువ మందిమి ఇళ్ళల్లో పనిచేసి బ్రతికే వాళ్ళం. ఇల్లు లేవు. కట్టుకున్న ఇల్లు కూడా… pic.twitter.com/YeUp8cNNZh
'పేదల బస్తీలలో త్వరలో పాదయాత్ర చేస్తా. మీ అధికారం, మీ పోలీసులు ఏం చేస్తారో చూస్తాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. తక్షణమే స్పందించి కనీస అవసరాలు తీర్చాలి. లక్ష్మీపూర్ కాలనీకి దారి లేకుండా కబ్జా చేశారు. కనీసం అంబులెన్స్ వెళ్లడానికి కూడా దారి లేదు. ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో పార్కును కబ్జా చేశారు. 40 ఏళ్ళ క్రితం పొట్టచేత పట్టుకుని వచ్చిన వారికి ఆశ్రయం కల్పించిన గడ్డ ఇది. ఉద్యమ బిడ్డగా, కరోనా సమయంలో పనిచేసిన మంత్రిగా నన్ను చూసి గొప్ప మెజారిటీతో గెలిపించారు. ఈ ప్రాంతం వారికోసం మాత్రమే కాదు. ప్రజలందరి కోసం చేస్తున్న పోరాటం ఇది. మూర్ఖపు ప్రభుత్వం కళ్లు తెరిపించాలి అనే ఈ ధర్నా. వీరికి చివరి వరకూ అండగా నిలబడతా. బంజారాహిల్స్‌లో మీ నాయకులు కోట్ల విలువైన భూములు కబ్జా పెట్టుకుంటే GO No.58, 59 కింద రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. ఇదేం న్యాయం' అని మండిపడ్డారు.
ఇక చిన్న జిల్లాలో కలెక్టర్ ప్రజలందరినీ కలుస్తారు అనుకున్నాం కానీ ఒక్కరోజు రాలేదన్నారు. కానీ పోలీసులని పట్టుకొని బుల్డోజర్లు పట్టుకుని వస్తున్నారని ఫైర్ అయ్యారు. 30 గజాల్లో కట్టుకున్న ఇల్లు కులగొడుతున్నారు. కోటిన్నర మంది చెత్త ఒక్క డంప్ యార్డ్ లో వేస్తారా? అని ప్రశ్నించారు. సిటీకి నాలుగు దిక్కుల వేయాలి కదా.. ఈ డంప్ యార్డు తో ప్రాణాలతో చెలగాటం ఆడతార? సిటికి దూరంగా చెత్త వేయాలని కోరుతున్నా. డంప్ యార్డ్ నాలుగు దిక్కుల పెట్టేవరకు మేము ఆందోళన చేస్తామని ఈటల చెప్పారు.
యుద్ధానికి సిద్ధం.. పాదయాత్ర చేస్తా: ఈటల
తెలంగాణ ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని చెప్పారు. పెద్దలను వదిలేసి పేదలను రోడ్డున పడేస్తున్న హైడ్రాను సహించేదిలేదన్నారు.
TG News: తెలంగాణ ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని చెప్పారు. పెద్దలను వదిలేసి పేదలను రోడ్డున పడేస్తున్న హైడ్రాను సహించేదిలేదన్నారు. దమ్ముంటే బడాబాడుల ఇండ్లు కూలగొట్టాలని సవాల్ చేశారు. ఈ మేరకు జవహార్ నగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు.
ఉద్యమ బిడ్డగా చెబుతున్నా..
'పేదల బస్తీలలో త్వరలో పాదయాత్ర చేస్తా. మీ అధికారం, మీ పోలీసులు ఏం చేస్తారో చూస్తాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. తక్షణమే స్పందించి కనీస అవసరాలు తీర్చాలి. లక్ష్మీపూర్ కాలనీకి దారి లేకుండా కబ్జా చేశారు. కనీసం అంబులెన్స్ వెళ్లడానికి కూడా దారి లేదు. ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో పార్కును కబ్జా చేశారు. 40 ఏళ్ళ క్రితం పొట్టచేత పట్టుకుని వచ్చిన వారికి ఆశ్రయం కల్పించిన గడ్డ ఇది. ఉద్యమ బిడ్డగా, కరోనా సమయంలో పనిచేసిన మంత్రిగా నన్ను చూసి గొప్ప మెజారిటీతో గెలిపించారు. ఈ ప్రాంతం వారికోసం మాత్రమే కాదు. ప్రజలందరి కోసం చేస్తున్న పోరాటం ఇది. మూర్ఖపు ప్రభుత్వం కళ్లు తెరిపించాలి అనే ఈ ధర్నా. వీరికి చివరి వరకూ అండగా నిలబడతా. బంజారాహిల్స్‌లో మీ నాయకులు కోట్ల విలువైన భూములు కబ్జా పెట్టుకుంటే GO No.58, 59 కింద రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. ఇదేం న్యాయం' అని మండిపడ్డారు.
Also Read: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!