BIG BREAKING: బీఆర్ఎస్ కు కీలక నేత రాజీనామా!

బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. ఈ నెల 9న ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

New Update
Guvvala Balaraju

బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. బీజేపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 9న గువ్వల బీజేపీ గూటికి చేరే ఛాన్స్ ఉందన్న చర్చ సాగుతోంది. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి బీఆర్ఎస్ లో కొనసాగారు గువ్వల. దీంతో గత మూడు ఎన్నికల్లో ఆయనను అచ్చంపేట అభ్యర్థిగా బరిలోకి దించింది గులాబీ పార్టీ. 2014, 2018లో ఆయన వరుస విజయాలు సాధించారు.
ఇది కూడా చదవండి:Telangana: కేసీఆర్‌ ఇష్టమొచ్చినట్లు డిజైన్లు మార్చేశారు.. మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు

కానీ, గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి నాటి నుంచి కూడా ఆయన బీఆర్ఎస్ లో యాక్టీవ్ గా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా గువ్వల ఉన్నారు. వారం క్రితం హరీష్ రావు నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలోనూ పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఆయన రాజీనామాకు కారణం ఏంటనే అంశం ఇంకా బయటకు రాలేదు. 

మధిర మాజీ ఎమ్మెల్యే సైతం..

మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు సైతం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. డిప్యూటీ సీఎం, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఒకే రోజు బీఆర్ఎస్ పార్టీకి రెండు బిగ్ షాక్ లు తగిలినట్లైంది. మరో వైపు కాళేశ్వరం కమిషన్ లో సైతం కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ పేర్లను ప్రస్తావించిన విషయం తెలిసిందే. నిపుణుల కమిటీ వద్దని చెప్పినా కేసీఆర్ ఒత్తిడి కారణంగానే రిపోర్ట్ పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని కమిషన్ తన రిపోర్ట్ లో పేర్కొంది. దీంతో కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ముఖ్య నేతలతోసమావేశం అయ్యారు. తాను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. కాళేశ్వరం కమిషన్ పై చర్చించేందుకు ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నేతలు గుడ్ బై చెప్పడం బీఆర్ఎస్ నేతలను కలవరపెడుతోంది. 

Advertisment
తాజా కథనాలు