/rtv/media/media_files/2025/01/29/8ojmnRRlkbX7uuoD0tHB.jpg)
Teacher Rude behavior
ఉపాధ్యాయుడు అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. విద్యార్థులకు సరైన మార్గనిర్దేశ్యం చేయాలి. తప్పుగా ప్రవర్తించే విద్యార్థులకు బుద్ధిచెప్పి వారిని సన్మార్గంలో నడిచేలా దిశానిర్ధేశం చేయాలి. కానీ విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి ఆదర్శంగా నిలువాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. బిడ్డల్లా చూడాల్సిన విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ విద్యార్థినీలు జరిగిన సంఘటనను తమ తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. అంతే వారు ఆగ్రహంతో స్కూల్‌కు చేరుకుని సదరు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.దీంతో బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకొని సదరు టీచర్‌ను నిలదీశారు. అయినా నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయున్ని చితకబాది దేహశుద్ధి చేశారు.అనంతరం నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉపాధ్యాయున్ని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడుకి దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2025
మహబూబాబాద్ జిల్లా - తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు.. పాఠశాల వద్ద విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన… pic.twitter.com/wp5Zu5P8ON