Telangana: కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష

తెలంగాణలో సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కూతురును చంపిన కేసులో తల్లికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. 2021 ఏప్రిల్‌లో మోతె మండలం మేకపాటి తండాలో ఓ మహిళ తన కూతురికి మానసిక స్థితి సరిగ్గా లేదని హత్యకు పాల్పడింది.

New Update
Court

Court

తెలంగాణలో సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కూతురును చంపిన కేసులో తల్లికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. 2021 ఏప్రిల్‌లో మోతె మండలం మేకపాటి తండాలో ఓ మహిళ తన కూతురికి మానసిక స్థితి సరిగ్గా లేదని హత్యకు పాల్పడింది. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. చివరికీ ఈ కేసుపై శుక్రవారం జిల్లా కోర్టు విచారణ జరిపింది. కూతురిని చంపినందుకు తల్లికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

Also Read: బైక్‌పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ?

ఇదిలాఉండగా నాంపల్లి పోక్సో కోర్టు కూడా శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. మైనర్‌ బాలికను లైంగికంగా వేధించిన కేసులో ఓ వ్యక్తికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2023లో సైఫాబాద్‌ పోలిస్ స్టేషన్ పరిధిలో గుట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ మైనర్‌ బాలికకు సెల్‌ఫోన్‌ ఇస్తానంటూ నమ్మించి తన వెంట తీసుకెళ్లాడు. ఆ తర్వాత లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. 

Also Read: కసబ్‌ కోసం రూ.28 కోట్లు ఖర్చు.. తహవూర్‌ రాణా కోసం ఎంత ఖర్చు చేయాలో ?

కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. సుదీర్ఘ వాదనల తర్వాత నాంపల్లి పోక్సో కోర్టు గుట్ల శ్రీనివాస్‌ను దోషిగా తేల్చింది. 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.5 పరిహారం చెల్లించాలంది. జరిమానా కట్టకుంటే మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.  

Also Read: బైక్‌పై హిందూ యువకుడు, ముస్లిం యువతి.. నలుగురు యువకులు ఏం చేశారంటే ?

telugu-news | rtv-news

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు