BRS MLAs Disqualification Case : నేడు ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకోర్టు కీలక విచారణ..తీర్పుపై ఉత్కంఠ!

తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వివాదం మరింత తీవ్రతరం అవుతోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది.

New Update
BRS MLAS

BRS MLAs Disqualification Case

BRS MLAs Disqualification Case :  తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వివాదం మరింత తీవ్రతరం అవుతోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. తెలంగాణ స్పీకర్‌పై బీఆర్ఎస్ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అన్ని కేసులను నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది.  జూలై 31న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటించట్లేదంటూ బీఆర్ఎస్ నాయకులు కెటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారు.

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని జూలై 31 న ఆదేశాలిచ్చింది దేశ అత్యున్నత ధర్మాసనం.. ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ ప్రారంభించారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుందని, మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టులో స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. మూడు నెలల గడువులోపే అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

మరోవైపు.. తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు 3 నెలల్లో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది వాదించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ విచారించారు. విచారణకు మరింత సమయం కావాలని కోర్టును కోరుతున్నారు.

 వివాదం ఏంటంటే? 

ఈ వివాదం 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెళ్ళం వెంకటరావు, అరెకపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, కాలే యదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ ఆ పది మందిపై అనర్హత పిటిషన్‌ను జనవరి 16న సుప్రీంకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ స్పీకర్ ఏ చర్యలూ తీసుకోలేదనీ, హైకోర్టు ఆదేశాలను కూడా పాటించలేదని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. సుప్రీంకోర్టు జస్టిస్ బీ.ఆర్. గవాయ్, ఏ.జి. మసీహ్ బెంచ్ జూలై 31న 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ని ఆదేశించింది.

Also Read: ఢిల్లీ పేలుళ్లకు 18 గంటల ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడ ఉన్నాడంటే?

Advertisment
తాజా కథనాలు