South Central Railway : దసరా , దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని 1400 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్యే తెలిపింది. అక్టోబర్, నవంబర్ నెలలలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి డిమాండ్ ఫుల్లుగా ఉండటం, ఉత్తర భారత రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు కూడా ప్రయాణించడానికి అధిక డిమాండ్ ఉన్న దృష్ట్యా అధిక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
ప్రస్తుతం ఈ రైళ్లు అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి రాబోయే రోజుల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఆలోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Also Read: తమిళనాడు రైలు ప్రమాదం..18 రైళ్లు రద్దు!
పండుగ సెలవులతో తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లితో పాటు ఇతర స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
Also Read: కొండా సురేఖ మంత్రి పదవి ఔట్.. TPCC చీఫ్ క్లారిటీ!
వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్యలో కనపడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో నిలబడి వెళ్లేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. జనరల్ బోగీల్లోకి కనీసం వెళ్లే పరిస్థితి ఉండటం లేదంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల డిమాండ్ల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే భారీగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
Also Read: సీఎం చంద్రబాబుపై అసభ్యకర ట్వీట్ పెట్టిన వ్యక్తిపై కేసు