ఎంత పని చేశావయ్య.. పెళ్లి కావడం లేదని తండ్రిని కడతేర్చిన కొడుకు!

నిజామాబాద్ జిల్లా నవీపేడ మండలం అనంతగిరిలో దారుణం జరిగింది. తండ్రితీరుతో తనకు పెళ్లికావడం లేదని.. అలాగే ఆస్తి దక్కించుకోవాలన్న దుర్భుద్దితో కొడుకే హత్య చేశాడు. అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు నమ్మించాడు. కానీ అసలు నిజం బయటపడటంతో పోలీసులు అరెస్టు చేశారు.

crime,
New Update

పిల్లల్ని కనడం ఒకెత్తయితే.. వారిని పెంచి పోషించడం మరో ఎత్తు. ఎన్ని కష్టాలు పడినా.. తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. వారు పడ్డ కష్టాలు వారి పిల్లలు పడకూడదని ఎంతటి కష్ట నష్టాన్నైనా భరిస్తారు. వారున్నంత వరకు తమ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడిపోతారు. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్నే కడతేర్చేందుకు కొందరు వెనుకాడటం లేదు. ఆస్తి కోసమో లేక మరేదైన విషయంలో తల్లిదండ్రులతో గొడవ పడి వారిని కడతేర్చుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. 

Also Read:  కిలో వెండి అక్షరాల లక్ష రూపాయలు!

తండ్రి తీరుతో పెళ్లి కావడం లేదు

తండ్రి తీరుతో తనకు పెళ్లి కావడం లేదన్న ఆలోచన ఒకవైపు.. ఆస్తి దక్కించుకునే ఆలోచన మరోవైపు ఇలాంటి దుర్భుద్దితో ఓ కొడుకు తన తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన మరెక్కడో జరగలేదు.. నిజామాబాద్ జిల్లా నవీపేడ మండలం అనంతగిరిలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్.. బండి విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

అనంతగిరికి చెందిన గౌరు అమృతం (54) పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి మహిపాల్, మనోజ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడి భార్య తనతో విభేదాలు పెట్టుకుని చాలా ఏళ్ల క్రితమే పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే కుమారులిద్దరూ బతుకుదెరువు కోసం కొంత కాలం కిందట దుబాయ్ వెళ్లారు. ఇక అక్కడ పని చేస్తూ పదిరోజుల క్రితం తన తండ్రి చనిపోయాడని అబద్దం చెప్పి.. అక్కడనున్న వారిని నమ్మించి పెద్ద కుమారుడు మహిపాల్ ఇండియాకు తిరిగి వచ్చేశాడు. 

Also Read:  రాష్ట్రంలో బాణాసంచా నిషేధం.. గోదాంలు సీల్ చేయాంటూ హైకోర్టు ఆదేశాలు!

టవల్ తో గొంతునులి హత్య

అనంతరం తన తండ్రి వద్దకు వెళ్లి ఉంటున్నాడు. అదే క్రమంలో ఆదివారం తండ్రీ కొడుకు కలిసి ఇంట్లో మద్యం తాగారు. మత్తులో ఉండటంతో తండ్రి అమృతం మెడకు టవల్ ను చుట్టి గొంతునులి హత్య చేశాడు. సోమవారం తన తండ్రికి బాలేదని ఓ ఆర్ఎంపీని రప్పించి ఆరోగ్యం బాలేక చనిపోయినట్లు క్రియేట్ చేశాడు. గ్రామస్థులకు సైతం అదే నమ్మించాడు. ఇక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. అమృతం సోదరి మెడపై ఉన్న గాయాలను చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు. 

Also Read: గొప్ప మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. 50 స్కూళ్ళు దత్తత తీసుకొని.

మహిపాల్ ను విచారించగా.. తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అమ్మతో వేరుగా ఉండటం.. అలాగే తరచూ మద్యం తాగుతండటం కారణంగానే తనకు పెళ్లి కావడం లేదని అన్నాడు. అందువల్లనే తండ్రిపై కక్ష్య పెంచుకున్నట్లు తెలిపాడు. అతేకాకుండా తండ్రి పేరిట ఉన్న ఆస్తులు, ప్లాటు అమ్మి తల్లి పేరుతో అనంతగిరిలో ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతోనే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

#telangana #crime-news #son-killed-father
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe