Silver Price: కిలో వెండి అక్షరాల లక్ష రూపాయలు!

హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం 80,500 కు చేరగా...కిలో వెండి తొలిసారిగా రూ. లక్ష ను అధిగమించింది. అంతర్జాతీయంగా ఔన్సు మేలిమి బంగారం ధర 2739 డాలర్లకు, వెండి ధర 34.05 డాలర్లకు చేరింది.

New Update
Silver Price: వెండి కొనాలంటే లక్ష పెట్టాల్సిందేనా? పరుగులు పెడుతున్న ధరలు..

Silver Prices: అంతర్జాతీయ విపణిలో పెట్టుబడులు భారీగా తరలి రావడంతో , బంగారం-వెండి ధరలు సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం 80,500 కు చేరగా...కిలో వెండి తొలిసారిగా రూ. లక్ష ను అధిగమించింది. 

Also Read:  మరో ఏడు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. మరికంటి భవానికి కీలక పదవి!

అంతర్జాతీయంగా ఔన్సు మేలిమి బంగారం ధర 2739 డాలర్లకు, వెండి ధర  34.05 డాలర్లకు చేరడం , అమెరికా డాలర్‌ విలువ 84.07 రూపాయలు పలుకుతున్నందున దేశీయంగా ఈ లోహాల ధరలు మరింత భగ్గుమన్నాయి.

Also Read: భారత్‌ సెక్యూలర్ దేశంగా ఉండొద్దని కోరుతున్నారా ?.. పిటిషినర్లకు సుప్రీం చురకలు

ఇంటర్నేషనల్‌ గా కొవిడ్‌ పరిణామాల తరువాత రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం..తదుపరి మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్‌-పాలస్తీనా, ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య యుద్ధ పరిస్థితులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. దీనికి అదనంగా ఇరాన్‌ పైనా అమెరికా సహా కొన్ని దేశాలు ఆంక్షలు విధించాలని చూస్తుండటం, చైనా-తైవాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్తులోనూ అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నారు.

Also Read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల అర్హులను తేల్చనున్న యాప్

నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే నేత కూడా అంతర్జాతీయ ఉద్రిక్తతల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశీయ ఆర్థిక పరిస్థితులు బాగున్నా, ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగవంత వృద్ధి మన దగ్గరే నమోదవుతున్నా కూడా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు చోటు చేసుకుంటున్నాయి.

భారీగా విక్రయాలకు దిగుతూ..

ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు భారీగా విక్రయాలకు దిగుతూ, పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. ఫలితంగా మన దగ్గర రూపాయి బలహీన పడుతూ డాలర్‌ రూ. 84 దాటింది. అయితే అమెరికాలో వడ్డీరేట్లు తగ్గిస్తున్నందున, బాండ్ల పై కంటే పెట్టుబడులను విలువైన లోహాల పైకి అధికులు మళ్లించడమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా విశ్లేషిస్తున్నారు. 

Also Read: రాష్ట్రంలో బాణాసంచా నిషేధం.. గోదాంలు సీల్ చేయాంటూ హైకోర్టు ఆదేశాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు